How and Why I Learned Telugu | Part 1

  Рет қаралды 122,905

yenaa yenaa

yenaa yenaa

Жыл бұрын

నేను తెలుగు ఎలా నేర్చుకున్నాను, ఎందుకు నేర్చుకున్నాను? ఎక్కువమంది అడుగుతూ ఉంటారు. కొన్ని వీడియోలతో ఆ విషయాన్ని వివరించాలని అనుకుంటున్నాను... ఆ క్రమంలో ఈ వీడియొ మొదటిది.
People often ask me how and why I learned Telugu, so I hope to make several videos to share that journey with you all. This is the first!

Пікірлер: 473
@user-pn9py9bz2u
@user-pn9py9bz2u 11 күн бұрын
నా తెలుగు తల్లికి మంగళారతులు ఈ తెలుగుమాటాలాడు పరదేశి చెల్లికి పాదాభివందనం
@venkatpoduguconnects
@venkatpoduguconnects 15 күн бұрын
You speak more fluent and accurate Telugu than native telugu speakers.
@quickeasyrelaxmusic9350
@quickeasyrelaxmusic9350 16 күн бұрын
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మా దేశం వచ్చి.. " దేశభాషలందు తెలుగు లెస్స " దేశం గర్వించదగ్గ మా భాష నేర్చుకుంటూ మాతో ఉంటూ తెలుగు నేర్చుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు. 🙏@yenaayenaa
@ravikishorepemmaraju1657
@ravikishorepemmaraju1657 6 күн бұрын
ఏదో చెత్త కాకుండా మంచి సంభాషణ చూశాను. అద్భుతం. రామనరసింహం గారికి, విదేశీ బంగారానికీ శుభాకాంక్షలు 🙏🥰💐💐💐
@vishwanathgoud1913
@vishwanathgoud1913 23 күн бұрын
తను అమెరికన్ అయినా ఆంగ్ల పదాలు లేకుండా చక్కటి తెలుగు ఎంత బాగా మాట్లాడింది అంటే .... మనం తెలుగు మాట్లాడుతున్నాము అని అంతా ఆంగ్లం లోనే మాట్లాడేటంతగా ... తన తెలుగు వింటుంటే మనం తెలుగే మాట్లాడుతున్నామా ? అనిపిస్తుంది. ఒక మంచి అనుభూతి తో ఈ రోజు మొదలైంది. 🥺🥺
@umamaheswararaomannepalli4641
@umamaheswararaomannepalli4641 22 күн бұрын
YOU ARE SO GREAT
@yenaa_yenaa
@yenaa_yenaa 17 күн бұрын
నా మీద అభిమానం తో అంటున్నారు కానీ నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నా వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
@nagendravarma81
@nagendravarma81 7 күн бұрын
పాడనా తెనుగు పాట పరవశమై పాడనా తెనుగు పాట చాలా బాగా మాట్లాడుతున్నారు సంతోషంగా వుంది ఎందుకంటే మన భాషని ఇంకొకరు మాట్లాడుతున్నారు & ప్రేమిస్తున్నారు అంటే. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు మా సంస్కృతిలో బాగా కలిసిపోయినట్లున్నారు మీరు ఇలాగే మా సంస్కృతి, భాష & దేశం తరఫున ఒక రాయబారిలాగ, ఒక వంతెనలాగ వుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం స్వస్తి . శుభం భూయాత్. జై హింద్.
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 21 күн бұрын
తెలుగు మాట్లాడటం వలన మన శరీరంలో 72000 నాడులు వూత్తేజితమవుతాయట. Good డిసిషన్ 👏👏👏
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 21 күн бұрын
హిందీ ఇండస్ట్రీ నుండి తెలుగు ఇండస్ట్రీ కి ఎంగిలిపీసుతో వచ్చే లేడీ ఆర్టిస్ట్స్ ఈవిడను చూసి సిగ్గు తెచ్చుకోండి.
@dravidaraja
@dravidaraja 25 күн бұрын
మీ ఇద్దరి సంభాషణ చూస్తే, చిన్నప్పుడు నేను మా తాతయ్య తో ఇలానే మాట్లాడేవాడిని. ఆ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.. చాలా బాగుంది మీ ఇరువురి సంభాషణ, మీ తెలుగు ❤
@yenaa_yenaa
@yenaa_yenaa 17 күн бұрын
మీకూ, మీ తాతయ్యకి మధ్య జరిగిన సంభాషణల తో ఈ నా సంభాషణ పోల్చడం చూసినప్పుడు, నాకు కలిగిన సంతోషాన్ని చెప్పడానికి నాకు అస్సలు పదాలు దొరకడంలేదు.... ఇంత పెద్ద మెప్పుకోలుకి నేను సరిపోగలనా? అని అనిపించింది. ధన్యవాదాలు.
@Gopinathk17
@Gopinathk17 24 күн бұрын
Oh wow..Your telugu is better than so many Telugu people.
@karthiksai6736
@karthiksai6736 11 күн бұрын
no inter nibbis were hurt in this comment
@PuLi2024
@PuLi2024 Күн бұрын
తెలంగాణ లో వున్న తెలుగు వాళ్ళ కంటే బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన వుత్తరాది, గుజరాతి , మరాఠీ, కర్ణాటక , తమిళనాడు, తురక ముస్లిం ల కంటే యింకా బాగా మాట్లాడుతున్నారు. మీకు చాలా పట్టుదల , తెలివితేటలు, వోపిక, నేర్చుకోవాలి అనే జిజ్ఞాస వుంది. వీటితో పాటు మీ మనస్సు చాలా స్వచ్ఛం. మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ, మీరు అమెరికన్సుకు తెలుగు వారికి మధ్య వారధిగా వుండాలని వాంఛిస్తూ , మీకు ఆంధ్రులందరి తరపున నా శుభాకాంక్షలు. 🎉🎉🎉🎉🎉
@CultReddy
@CultReddy 24 күн бұрын
Wow, you're like a rare gem! A white American girl living in Andhra and speaking flawless Telugu? That's next-level impressive. You've got Andhra locals scratching their heads and wondering if they've forgotten how to speak their own language. Your Telugu is so impeccable that even the purists are giving you standing ovations. Keep rocking that linguistic prowess …you're practically a Telugu superstar!👍🏼
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 21 күн бұрын
నా సంతోషమెంటంటే మీరు చక్కగా ళ, ణ అనే అక్షరాలను ఉచ్చరిస్తున్నారు. 👏👏👏👌👌
@yenaa_yenaa
@yenaa_yenaa 21 күн бұрын
@@padmapriyarajavarapu514 🙏🏻
@sundarayerrapragada
@sundarayerrapragada 12 күн бұрын
సుందర ఎర్రాప్రగడ నుండి శుభాకాంక్షలు మరియు భారత దేశానికి స్వాగతం. మీరు దయచేసి అల్ ఇండియా రేడియో వైజాగ్ లేదా విజయవాడ స్టేషన్స్ వింటూ ఉండండి. నేను తెలుగు వాడిని. కానీ సరిఅయిన భాష నేను రేడియో ద్వారానే నేర్చుకున్నాను,
@jaiandhra7437
@jaiandhra7437 24 күн бұрын
అమ్మా .. వందనాలు .. మా తెలుగు పిల్లలు కూడా మీ అంత స్పష్టంగా మా "సుందర తెలుగు" మాట్లాడలేక పోతున్నారు. చాలా సంతోషం గా ఉంది
@yenaa_yenaa
@yenaa_yenaa 17 күн бұрын
🙏
@likithmahindra7564
@likithmahindra7564 22 күн бұрын
నా మాతృభాష తెలుగు అయినప్పటికీ అక్క మీ తెలుగు భాష నా కంటే చాలా బాగుంది 🥰
@sreekanthb3855
@sreekanthb3855 7 күн бұрын
ఆహా అద్భుతమైన తెలుగులో మాట్లాడుతున్న మీరు చాలా గొప్పవారు. మీకు తెలుగు భాష పట్ల ఉన్న శ్రద్ద కి చాలా సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వక అభినందనలు (heartful appreciations) తెలుగు భాష వర్ధిల్లాలి long live telugu జై తెలుగు తల్లీ జై జై తెలుగు తల్లి జై సనాతన ధర్మం జై భారత్.
@kukloobunny
@kukloobunny 23 күн бұрын
సంబ్రహ్మాశ్చర్యం నాకు స్ఫురించె పదం మీ సంభాషనవింటే .. భాషే మీకు ఆభూషణం ... మనసుతో పలికే ఈ తెనుగు పదం వింటే మీరు మరో జన్మ ఎత్తరేమో తెనుగును మీ మాతృభాషగా చేస్తే అనిపిస్తుంది. సాహో మిత్రమా మీ ప్రయత్నం అమోఘం ... తెనుగును మీ మాతృభాష అంత గొప్పగా పలకడం ఈభాషకు మీరు పట్టంకట్టిన చందం
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 21 күн бұрын
మీరు 3 సంవత్సరాల లో చక్కటి తెలుగు భాష నేర్చుకున్నారు. మీ భావ వ్యక్తీకరణ కూడా చాలా బాగుంది. పుస్తక పఠనం కూడా చేయగలిగితే భాష మీద మంచి పట్టు దొరుకుతుంది. నా సలహా ఎమిటంటే, చిన్న కథల పుస్తకాలను చదివి గలిగితే మంచిది.
@dr.k.vijayabhanu6829
@dr.k.vijayabhanu6829 Жыл бұрын
చాలా బాగా మాట్లాడారు మీరు. ఆచార్య పరిమి రామనరసింహం గారు మంచి గురువులు. వారి వద్ద పాఠాలు నేర్చుకోవడం మీకు ఒక అదృష్టం. మీ అనుభవాలను ఇలా మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది.
@yenaa_yenaa
@yenaa_yenaa Жыл бұрын
అవును, నిజమే అండి. పరిమి రామనారసింహం గారు చాలా మంచి టీచర్. నేను తెలుగు నేర్చుకోవడం అనే ప్రయాణం ఆయనతో మొదలయింది. ప్రస్తుతం American Institute of Indian Studies ద్వార ఇంకా బాగా తెలుగు నేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ వివరాలన్ని నా రాబోయే వీడియోల్లో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వీడియో చూసి మీరు స్పందించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.
@suryamogali78
@suryamogali78 25 күн бұрын
Mee telugu maku chala santhoshannichindi 👌🥰​@@yenaa_yenaa
@unseenworldofchanti9343
@unseenworldofchanti9343 Жыл бұрын
మీ ఉచ్చారణ కూడా చాలా బాగుంది ❤❤
@yenaa_yenaa
@yenaa_yenaa Жыл бұрын
ఇప్పుడిప్పుడే మెరుగు పెట్టుకుంటున్నాను. మీ సహ్రుదయతకి ధన్యవాదాలు. 😄
@jaggarao2312
@jaggarao2312 21 күн бұрын
@@yenaa_yenaa.. 👌👌🤗🤗👍👍
@see_green
@see_green 26 күн бұрын
proud moment when yenaa garu speak in telugu
@pokemonitishere202
@pokemonitishere202 5 ай бұрын
నేను మీ తెలుగులో గమనించింది ఏంటంటే... ప్రతి భాషకు ఒక ఇంటోనేషన్ అనేది ఉంటుంది. అది నేర్చుకోవడం చాలా కష్టం. ఆ ఇంటొనేషన్ వచ్చిందంటే వారు స్థానికుల్లో కలిసిపోగలరు. ఆ ఇంటోనేషణ్ ను తెలుగు లో మీరు చాలా బాగా పట్టుకున్నారు, బాగా మాట్లాడుతున్నారు. మీరు చాలా గొప్పండీ! మీరు తెలుగు quora లో join అవ్వండి. చాలా చాలా విషయాలు తెలుగు చరిత్ర గురించి తెలుస్తాయి! చాలా పెద్ద పెద్ద భాష నిపుణులు కూడా ఉంటారు అక్కడ!
@yenaa_yenaa
@yenaa_yenaa 4 ай бұрын
ఆలస్యానికి క్షమించండి... ఈ పోయిన మూడు వారాల్లో అమెరికాకి వెళ్ళి రావాల్సి వచ్చింది. మీ అభినందలకి చాలా ధన్యవాదాలండి. నా తెలుగు భాష నైపుణ్యం గురించి ఉన్నదాని కంటే ఎక్కువే మెచ్చుకున్నారు. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది! అందుకు మీ లాంటి వాళ్ళు ఇచ్చే సూచనలు ఎంతో అవసరం. ఇక, ఇంటొనేషన్ విషయానికి వస్తే, నా అభిప్రాయం లో కొంతమందైనా ఒక కొత్త భాష నేర్చుకున్నప్పుడు ఆ భాష ఇంటొనేషన్ని చాలా వరకు పట్టుకోగలరు. కాని, మామూలుగా వాళ్ళ మాతృభాష యాసను ఎప్పటికీ పూర్తిగా పొగొట్టుకోలేరు... మన మాతృభాష మన అస్తత్వంలో ఒక భాగం కదా? మరి అది ఎప్పుడూ పొగొట్టుకోకూడదు. మీరేమంటారు? :)
@KrishGirl143
@KrishGirl143 2 күн бұрын
​​@@yenaa_yenaaనాకు కూడా తెలుగు రాని నా స్నేహితులకు తెలుగు నేర్పించాలని వుంది.వాళ్ళకి కూడా నేర్చుకోవాలని వుంది. ఎలా నేర్పితే సులభం గా నేర్చుకుంటారో మీ అనుభవం ప్రకారం సలహా ఇవ్వండి.
@srinivasaadipudi6732
@srinivasaadipudi6732 19 күн бұрын
భారతదేశంలో మాట్లాడే మూడవ అతిపెద్ద భారతీయ భాష, ఇది తీపి మాత్రమే కాదు, బహుముఖ చరిత్రను కలిగి ఉంది. మీరు దానిని నేర్చుకోవాలని కోరుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. తెలుగు అవధానానికి హాజరవ్వండి, మీరు భాష యొక్క ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు
@ramadityak6138
@ramadityak6138 23 күн бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స🙏🙏
@mukundakrishna2300
@mukundakrishna2300 24 күн бұрын
మీరు తెలుగు భాష మాట్లాడుతునందుకు గర్వంగా వుంది సోదరి మీరు మరిన్ని విషియలు పై అధ్యాయం చేసి తెలుగు లో phd చేసి మా అందరికి ఆదర్శప్రాయాయంగా ఉంటారని ఆశిస్తూ మీ తెలుగు తమ్ముడు ❤
@yenaa_yenaa
@yenaa_yenaa 17 күн бұрын
తెలుగు లో PhD చేయడం కంటే మీ అందరితో సంభాషించడమే నాకు ఇష్టం. -మీ అక్క​ :)
@mukundakrishna2300
@mukundakrishna2300 17 күн бұрын
@@yenaa_yenaa ధన్యవాదములు అక్క మీరు మాట్లాడుతునందుకు చాలా ఆనందం గా ఉన్నది ❤️😘
@LavenderValley777
@LavenderValley777 24 күн бұрын
మంచి తెలుగు నేర్చుకున్నారు.. ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన యాస కాకుండా స్టాండర్డ్ గా ఉండే స్వచ్ఛమైన అచ్చ తెలుగు నేర్చుకోగలగటం అదృష్టం 🎉
@harishreddy4574
@harishreddy4574 23 күн бұрын
Manchi telugu chedda telugu ani undadhu..adhi mandalikham..
@LavenderValley777
@LavenderValley777 23 күн бұрын
@@harishreddy4574 pranthaanni batti Telugu lo vere padaalu kalustay.. adi Konni states lo ekkuva.
@jathinkarthik143
@jathinkarthik143 23 күн бұрын
@@harishreddy4574untadi andi… ante annan antaru kaani… telugu vachindi paala script nundi nd aa paala script devanagiri lipi nundi.. ippudu manam antha entho kontha english matludutunnam but telugu ni english cheyyatla as they do in Telangana… padalu baashalu add avvachu .. but unna Telugu maarakudadu
@prudvireddyvatte8711
@prudvireddyvatte8711 23 күн бұрын
@@jathinkarthik143ante annaru antaru kani telugu vachindi dravidian script nundi devanagiri script nundi vachindi hindi, telangana lo english kalaparu urdu/hindi kalustundi andhra lo british palana valla engish words kalustay kasta chaduvukuni upanysam ivvandi 😂
@msquare2462
@msquare2462 23 күн бұрын
అరేయ్ ❤డేందర్ .. తెలంగాణా యాస గురించి మాట్లాడితే నాలుక కోస్తాం .
@maheeinvest
@maheeinvest 11 күн бұрын
ఎవరమ్మా నువ్వు.., నీ తెలుగు మాట వాచకం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది. నీకు ఆ భగవంతుడు ఉజ్వలమైన భవిష్యత్తు ని ఇవ్వాలని ఇలాగే తెలుగు భాష కి నువ్వు సేవ చేస్తూనే ఉండాలని ప్రార్ధిస్తున్నాను. తెలుగు అమ్మాయిలు ఈ అమ్మాయిని చూసి సిగ్గుతెచ్చుకోండి.., మీకు అటు ఇంగ్లీష్ వచించావడు తెలుగు మాట్లాడారు.. ,ఏదేనుకీ బడాయి వేషాలు.
@tailwindcraftmanship
@tailwindcraftmanship 12 күн бұрын
your sitting style make you so much indian and especially a telugu girl 😆
@stephenking9305
@stephenking9305 21 күн бұрын
Your Telugu is so much better than what our Telugu actors and actresses speak on stage and in interviews.
@maheeinvest
@maheeinvest 11 күн бұрын
Yes
@sathishkumar-st9nk
@sathishkumar-st9nk 6 күн бұрын
ప్రపంచ భాషలు అనేకం. భావవ్యక్తీకరణలో అత్యంత స్పష్టమైనది , అత్యంత ఉన్నత పదాలు కలిగిన భాష తెలుగు భాష🙏🙏🙏 సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలు వినండి తెలుగు మాధుర్యం ఇంకాస్త తెలుస్తోంది.
@Vijjiprsn
@Vijjiprsn 9 күн бұрын
మీరు ఎంతో బాగా సాధారణమైన తెలుగు మాట్లాడుతున్నారు. నేను కించపరుస్తున్నాను అని కాదు గాని, మా తెలుగు వారు మీలా తెలుగు మాట్లాడమంటే గ్రాంథికంలో మాట్లాడతారు. ఎందుకంటే, అనే కారణం కన్నా తెలుగు భాషా పరిపూర్ణంగా వాడుకలో లేకపోవడం, ఆంగ్ల భాషతో కూడుకున్న తెలుగుని మాట్లాడడంతో మీలాగా స్వచ్ఛమైన తెలుగు ని సరళంగా మాట్లాడడానికి కూడా ఆపసోపాలు పడుతుంటారు. నాకు చాలా గర్వంగా ఉంది మీరు తెలుగు మాట్లాడుతుంటే నేను ఇతరులతో మాట్లాడుతున్నట్టు ఉంది.
@yenaa_yenaa
@yenaa_yenaa 8 күн бұрын
"మీలాగా స్వచ్ఛమైన తెలుగు ని సరళంగా మాట్లాడడం" అనే మీ కామెంట్ నా హృదయానికి తాకింది. మీకు నా వీడియో అంతగా నచ్చినందుకు నాకు కూడా గర్వంగా ఉంది.
@VijayaAvadhanula
@VijayaAvadhanula 3 күн бұрын
ఇంత చక్కగా చక్కని తెలుగు లో మాట్లాడినందుకు నా అభినందనలు. నేను మా శ్రీమతి కలసి కలగూర గంప అనే కేవలం తెలుగు పదాలనే ఉపయోగిస్తూ అనేకమంది రచయిత్రులు రచయితలు రాసిన కథలను ఒక సంపుటిగా ప్రచురించాము. మీకు చదివే సమయం ఉంటే ఆ పుస్తకాన్ని మీకు పంపిస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ అడ్రస్ పంపించండి. మరోసారి మీరు మాట్లాడిన పద్ధతికి మిమ్మల్ని అభినందిస్తున్నా
@yenaa_yenaa
@yenaa_yenaa 2 күн бұрын
మీ అభిమానానికి చాలా ధన్యవాదాలండి. నేను ఎక్కువ ప్రయాణాల్లో ఉండడం వల్ల మీ పుస్తకం soft copy లో నా email (yenaa.yenaa907@gmail.com) కి పంపగలిగితే నేను తప్పకుండా చదువగలను. 🙏
@amaravathikathalu5639
@amaravathikathalu5639 13 күн бұрын
నాకు ఈ వీడియో చూస్తున్నంత సేపు ఆనంద బాష్పప్లు వొచ్చాయి. మీరు తెలుగు ని ఇంత మధురంగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనంద మేసింది. 🥺🥺
@SaiKrishna-xc6kj
@SaiKrishna-xc6kj 8 күн бұрын
సామాజిక మాధయమాల్లో చాలా కాలం తర్వాత మళ్ళీ ఓక మంచి వీడియో చూసాం.. ముచ్చటగా అనిపించింది...ధన్యవాదాలు..
@venkateswarraovemuganti3980
@venkateswarraovemuganti3980 17 күн бұрын
ఆమె తెలుగు మాట్లాడటం మనం ఆనందిస్తాం. కానీ ఆమె మాట్లొడే తెలుగు లో కూడా యాస ఉంది. మనం ఆంధ్ర ప్రదేశ్ వారమైనా, తెలంగాణ వారమైనా , మనందరం మాట్లాడే తెలుగు భాష లో స్వఛ్ఛత లేదు. ఒక భాషపై ఇతర భాషల ప్రభావం పడినపుడు , పదాలు ఉచ్చారణలో కొంత తేడా వస్తుంది. ఆ తేడానే యాస అంటున్నాం. . మనం ఇంగ్లీష్ మాట్లాడినా స్వభాష ప్రభావం వల్ల ఇంగ్లీష్ పదాల ఉచ్చారణలో తేడా వచ్చి సహజత్వాన్ని కోల్పోతుంది. దానినే యాస అంటాం. ఇది అన్ని భాషలలో ఉంటుంది. ఇంగ్లీష్ కూడా అమెరికన్ ఇంగ్లీష్ కు, బ్రిటిష్ ఇంగ్లీష్ కు ఉచ్చారణలో తేడా ఉంటుంది. బ్రిటన్లో కూడా ఇంగ్లీష్ ఉచ్చారణలో కూడా అందరిది ఒకే రకముగా ఉండదు. అందువలన భాష యాస ల గురించి విమర్శించు కోవడం సరిఅయినది కాదు. ఎవరి భాష వారికి గొప్ప గానే ఉంటుంది. అసలు తెలుగు భాష లో 70% సంస్కృతం ఉంది. మిగతా 30% లో కనీసం 10% ఇతర భాషా పదాలు ఉంటాయి. ఈ ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో వాడే పదాలో చాలా వాటికి తెలుగులో పదాలు దొరకవు.
@charan8083
@charan8083 14 күн бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపూ మొహం మీద చిరునవ్వు అలా ఉంటూనే వచ్చింది. సొంత వాళ్ళే తెలుగు నుడిని విస్మరిస్తున్న ఈ రోజుల్లో మీ బోటి వాళ్ళు చొరవ తీసుకుని మరీ భాష నేర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తాతగారు స్థానంలో ప్రొఫెసర్ గారు ఉంటూ మనవరాలిగా మీకు తెలుగు పాఠాలు బోధిస్తూ ఉండటం చూడ ముచ్చటగా ఉంది. తెలుగు మీద మీ మమకారానికి శతకోటి వందనాలు 🙏🏽 అలాగే ఇంత చక్కటి వీడియో మాకు అందించినందుకు కూడా మా ఈ నెనర్లు 🙏🏽
@maniyadav6190
@maniyadav6190 22 күн бұрын
I am glad, she chose to learn neutral Telugu rather than any specific slang. My slang used to have dominant Godavari style, but in Hyderabad after I mixed up with people from different parts of Andhra and Telangana, I started practicing neutral Telugu. Even my Telangana friends used to make an effort and speak neutrally so that I can clearly understand them. Great memories.
@chosenone7279
@chosenone7279 24 күн бұрын
నేను తెలుగు వాడినే కానీ నాకు జనాలతో కలవడం రాదు నాకు ఏమీ అర్ధం అయ్యేది కాదు నేను అర్థం చేసుకోలేను మీ డాక్యుమెంటరీ వల్ల మా సంస్కృతిని అర్థం చేస్కోగాలుగుతునను ఇంకా మా ప్రజల గురించి కూడా,పెరుగుతున్న జనాభా వల్ల ఏమో తెలీదు గానీ చాలా మంది తెలుగు ప్రజలు వల్ల కల్చర్ కి దూరం అవుతున్నారు ప్రస్తుతం ఉన్న చదువుల వ్యవస్థ వల్ల అనుకుంట పక్కన వారి గురించి మేము అర్థం చేసుకోలేక పోతునాం
@unseenworldofchanti9343
@unseenworldofchanti9343 Жыл бұрын
చాలా బాగా మాట్లాడుతున్నారు మేడమ్ సూపర్
@rajeshbajjuri8515
@rajeshbajjuri8515 6 күн бұрын
మీరు తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతున్నారు
@VijayaAvadhanula
@VijayaAvadhanula 3 күн бұрын
చాలా బాగుంది తల్లీ మీరు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడిన తీరు.
@sharmapillalamarri3341
@sharmapillalamarri3341 14 күн бұрын
స్వచ్ఛమైన తెలుగు స్ఫుటంగా మాట్లాడుతున్నార తల్లీ. అద్భుతం మధురాతిమధరంఅమ్మా!! దీర్ఘసుమంగళీభవ. సదాసుఖీభవ!!!
@tharakaramareddy2218
@tharakaramareddy2218 26 күн бұрын
Meeru mariyu mee sambhashanalu...maaku oka drusya kaavyam laa anipisthavundi. Mee madhuramaina gonthu lopali nunchi vache...mrudu madhura maina sabdam kalisina maatau ... mammalni vivasulni chesthu vunnai. Eee anubhuthi... Varnanathitha mainadi maiyu maatalaku andanidi. Meeru entha samayam maatladina... maaku inka.. inka vinalani anipistoo vuntundi. Itlu...prematho mee abhimani. 🙏❤🇮🇳❤💐💐💐
@NagarajuChukkala-jl6yo
@NagarajuChukkala-jl6yo 14 күн бұрын
🙂I loved the video. I am from a village that's 140km away from Hyderabad, in Telangana, and I speak Telugu natively. Your Telugu is excellent! I recently spent a month in Hyderabad, which is unusual for me. The culture there is a little different to my own - people don't talk to strangers much and they mean business. In that respect, my village culture is closer to that of yours in the US. Thanks for the video!
@yenaa_yenaa
@yenaa_yenaa 14 күн бұрын
@@NagarajuChukkala-jl6yo Your village sounds very special. I am so curious about the different elements that structure village life generally, but it’s difficult for me to visit villages without first knowing someone in them. But when I get an opportunity, I take it, and I never regret it. Thank you so much for watching and for sharing your reflections. Your kind words have touched my heart.
@sujaireddy4311
@sujaireddy4311 9 күн бұрын
నేను USA లో పుట్టి పెరిగాను. నాకు హైదరాబాద్ వెళ్లిన ప్రతిసారి అక్కడే ఉండి పోవాలని అనిపిస్తుంది. మీ వీడియో చూడడం నాకు చాలా సరదాగా ఉంది.
@yenaa_yenaa
@yenaa_yenaa 9 күн бұрын
మీరు USA లో పుట్టి పెరిగినా తెలుగు భాష రాయడమూ, చదవడం అనే విషయం అద్భుతం! మీకు హైదరబాద్ ఎందుకు అంతగా నచ్చుతుందో నేను అర్ధం చేసుకోగలను.
@sujaireddy4311
@sujaireddy4311 9 күн бұрын
@@yenaa_yenaa నేను ఇప్పుడు Chicago లో పనిచేస్తున్నాను. మిడ్ వెస్ట్ జనాలు గురించి నువ్వు చెప్పినప్పుడు నాకు నవ్వొచ్చింది.
@kittu529
@kittu529 23 күн бұрын
Your utterance of the Telugu words sounds so good like honey. I hadn't believed that the Telugu language was so sweet until I heard it from you. the words you choose to speak are the actual Telugu words to be used while communicating. Well done. Many Telugu people are still to finish learning the Telugu language.😂
@yenaa_yenaa
@yenaa_yenaa 21 күн бұрын
@@kittu529 🙏🏻
@ELEPHANt-GAMER_6969
@ELEPHANt-GAMER_6969 8 күн бұрын
@rameshsarma9755
@rameshsarma9755 Жыл бұрын
నమస్కారం ఏనా🙏 ముందుగా మీకు తెలుగు భాష ,సంస్కృతి, సంప్రదాయం నేర్చుకోవాలని ఉన్న ఆసక్తికి హృదయపూర్వక శుభాభినందనలు💐మీ పూర్తి ముఖాముఖి చూసాను. అత్యంత అద్భుతంగా ఉంది మీ తెలుగు భాష నేర్చుకునే విధానం. గురువుగారికి పాదాభివందనం🙏ఒక్క విషయం ఏనా భాష,సంస్కృతి, సాంప్రదాయం అనేవి మన ఇంటి నుండే తల్లిదండ్రుల నుండే మొదలవ్వాలి. మీ కుటుంబం మీకు ఆ వాతావరణం కలిపించినందుకు వారికి నా నమస్సులు. ఇంత చక్కటి వీడియోలో ఎన్నో అమూల్యమైన విషయాలు అనుభవాల పరిమళాలు వెదజల్లుతున్నాయి. మీతో నాకున్న సంస్కృతి, సాంప్రదాయపు అలవాట్లు పంచుకోవాలని కుతూహలంగా ఉంది.మీకు అభినందనలతో.లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై🌹💐🎻❤
@yenaa_yenaa
@yenaa_yenaa Жыл бұрын
మీ ఆలోచనలను నాతో మనస్పూర్తిగా పంచుకున్నందుకు ధన్యవాదాలు. నిజానికి మంచి టీచర్లు దొరకడం నా అద్రుష్టం. మీ సంస్క్రతీ, సంప్రదాయల గురించి మీనుంచి నేర్చుకోవడానికి నాకు కూడా ఆసక్తిగా ఉంది. సమయం దొరికిన్నప్పుడల్లా దయచేసి మీ ఆలోచనలు పంచుకోండి.
@gangapatlanagaraj8063
@gangapatlanagaraj8063 2 күн бұрын
Vammo balematladutunaru telugu meeru chala ascharyanga santhoshamga vundi
@itschinnam
@itschinnam 7 күн бұрын
అద్భుతం ... అంతే .. ఇంకా చెప్పటానికి ఏమిలేదు
@revanth84
@revanth84 8 күн бұрын
Your Telugu is better than many Telugu speakers. 🙌
@5eMedia
@5eMedia 26 күн бұрын
చాలా బాగా మాట్లాడుతున్నావు తల్లీ... శుభాభినందనలు 🎉
@yenaa_yenaa
@yenaa_yenaa 26 күн бұрын
🙏 ధన్యవాదాలు!
@josephrayapati6110
@josephrayapati6110 9 күн бұрын
ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక ఆంగ్లం టీచర్ గా పని చేస్తున్న కానీ చాలా మంది పిల్లలలో తెలుగు నేర్చుకునే ఆశ తగ్గిపోతుంది.. నేను ఇంగ్లీష్ టీచర్ అయన మ స్కూల్ లో ఉన్న తెలుగు టీచర్ గారు పిల్లలలో పడే కష్టం అంతా ఇంతా కాదు. కానీ మీరు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే.... మిమల్ని చూపించి మా పిల్లలకి తెలుగు లో మాట్లాడటం లో ఉన్న గొప్పతనం చెప్పాలని భావిస్తున్న.. చాలా చాలా ధన్యవదాలు .. ఎన్నో భాషలు ఉన్నాయి ఈ భారత దేశం లో మా లెస్సా అయన భాషని ఏంచుకునదుకు .
@yenaa_yenaa
@yenaa_yenaa 8 күн бұрын
నా చిన్ని ప్రయత్నం ముందు తరానికి తెలుగు భాష పట్ల అసక్తిని పెంచగలిగితే, అదే నాకు గొప్ప బహుమతి, కానీ నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. నా తరపు నుంచి మీ బడి లో తెలుగు టీచర్ కి నా నమస్కారాలు చెప్పండి. 🙏
@ritantareprises7967
@ritantareprises7967 22 күн бұрын
అమ్మా మీరు తెలుగు భాష లో ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు.
@srini9653
@srini9653 9 күн бұрын
Impressive! It is very uncommon for an American to embrace such a diagonally opposite culture (forget about language). Not only your Telugu is fluent but it is pure. Sometimes we need folks like you to inspire the local crowd. All the best!
@amancharlav
@amancharlav 15 күн бұрын
వెళ్ళే వాళ్ళం ఎంత బాగా అనింది, వెల్లె వాల్లం అనకుండా😊
@nehapappu5059
@nehapappu5059 9 күн бұрын
Your telugu is better than many so called Telugu language Tollywood movie stars both native and imported. Meeku satakoti vandanam.
@yenaa_yenaa
@yenaa_yenaa 9 күн бұрын
I'm not sure how I compare to others, but I'm certainly working on it! Thank you for your thoughtful words of encouragement.
@kokkeramulu35
@kokkeramulu35 Жыл бұрын
Meeru chaala chakkati hava bhavaalatho maatladaaru bagundhi. మీరు చాలా చక్కటి హావభావాలతో మాట్లాడారు బాగుంది
@yenaa_yenaa
@yenaa_yenaa Жыл бұрын
మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ!
@siberianhusky4477
@siberianhusky4477 24 күн бұрын
Chala gharvamga undi mee Telugu vintunte., kallalo neellu tiruguthunnai mee matalu vintunte gundevalku thagulthunnai mee padhalu., nenu Telugu vadini iyyina intha spashtam ga mee la mataladaleka pothunanduku siggu paduthunna., chala Santhosham ga undi mee video choosi anduku., naadi vizag ye meeru vizag ani palukuthunte kallalo neellu tirugai., Mari vishayam yenti ante Alaska naaku chala istam iyyina pradesham yenno documentaries choosthunta chala prayathisthunna velladanki yedo oka roju kachitham veltha Alaska., anyway eroju chala anandhanni pancharu meeru
@sukumarjonnalagadda6649
@sukumarjonnalagadda6649 18 күн бұрын
Maa maji CM jagan ki telugu nerpinchandi
@PrasadVenuturumilli
@PrasadVenuturumilli 11 күн бұрын
😂
@nikhiljakka4551
@nikhiljakka4551 11 күн бұрын
Ex-CM bro 😅
@BruceWayne-gj9gv
@BruceWayne-gj9gv 10 күн бұрын
😂😂😂😂😂😂😂
@vrojiesh
@vrojiesh 2 күн бұрын
Keka comment
@dhurga18
@dhurga18 13 сағат бұрын
​@nikhiljakka4551 Yes, he told maji CM
@ExMuslimDidi
@ExMuslimDidi 10 күн бұрын
మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు.. మా తెలుగు వింటుంటే ఆనందం లో పర్వశించిపోతున్నాం .. భాష లందు తెలుగు భాష లెస్స 🙏🚩😊. మీరు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనీ ,ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మీ కొత్త subscriber ❤❤❤❤❤❤❤❤❤❤ Lots of siso 💜😊
@vijaykumar-pc5uq
@vijaykumar-pc5uq 23 күн бұрын
Wow..I am impressed with telugu speaking skill...మీరు మా తెలుగు భాషనీ నేర్చుకుని ఇంత చక్కగా మాట్లాడుతున్నందుకు చాల కృతఙ్ఞతలు 🙏....తెలుగువాళ్ళమైనా మేమె తెలుగు ని రోజురోజుకి మర్చిపోతున్నాం, అలాంటిది మీరు మా కంటే స్పంష్ట్టం గ మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా వుంది...నా కొడుకుకి మీ ఈ వీడియో ని చూపించి మాతృ భాష గొప్పదనం గురించి మరింత వివరంగా చెప్తాను...!!!
@sample1648
@sample1648 16 күн бұрын
Madam chala Baga Telugu matladaru , good great hard work, keep it up,I viewed right now
@RamboIndian
@RamboIndian 23 күн бұрын
It’s really crazy I just saw the vizag video that time this channel was below 3k followers within hours wow.. that’s power of Telugu language, vizag title 👏🏼 looking forward for more interesting content in Telugu.
@samarouthusambaiah2937
@samarouthusambaiah2937 15 күн бұрын
అక్క భలే మాట్లాడుతున్నారు. చాలా సంతోషం అనిపించింది.. మీ మీద గౌరవం పెరిగింది... నచ్చారు. ఒకసారి ఓణి ధరించండి.. అద్భుతం.
@nitiKT
@nitiKT 12 күн бұрын
అక్కా.. మీకు ఒక దాండం..
@tskaff
@tskaff Жыл бұрын
This is wonderful Anna. I love the peacefulness, beauty, and pace of the video. The very tasteful piano and the series of almost still shots and only occasional fades and dissolves and no wild zooms and pans. It's a compelling story also. Not many westerners have become fluent in an Indian language. It shows your sincere heart for the people and the country. Really great to see you and to remember your friendship to Judy and me. Blessings.
@yenaa_yenaa
@yenaa_yenaa Жыл бұрын
Thank you for such a thoughtful and encouraging comment. I think one of the things I notice most about putting this much time and effort into learning a language is that, with good teachers, (which I am fortunate to have!) there is all manner of cultural meaning and cultural logic which surfaces-shades of nuance that could otherwise be so easily lost on a foreigner… it’s a beautiful thing, to embark on such a journey when motivated by joy.
@saichaithvik
@saichaithvik 18 күн бұрын
Nxt gen should learn Telugu
@Commonsenseisrare
@Commonsenseisrare 23 күн бұрын
You are speaking much much better Telugu than most native speakers. 👏👌
@crewm6778
@crewm6778 21 күн бұрын
There are people in India who don't talk their mother tongue forget about other languages. They only talk in English.
@suryanagarjunayalla3875
@suryanagarjunayalla3875 25 күн бұрын
Thank you yenna for uploading the content. Meku Andhra Telangana languages lo differences Ela anipinchevi ? Indian spicy food alavatu ayindha ? Hyd biryani nachindha ? 2009 time lo hyd ante Telangana agitation jarige time lo Meru ikkade unnaru… but inni years time endhuku thesukunnaru KZfaq lo make share cheyataniki … thank you so much for your genuine videos …
@vijayamphysicsclassesbycee4790
@vijayamphysicsclassesbycee4790 5 күн бұрын
Great video. Keep it up.
@srinathp1234
@srinathp1234 10 күн бұрын
Welcome to Hyderabad 😊
@krishnamaganti6130
@krishnamaganti6130 23 күн бұрын
చాలా సంతోషం గా వుంది మీరు తెలుగు మాట్లాడుతుంటే ❤
@sairadha674
@sairadha674 23 күн бұрын
"Vyavasta" oh my god. Even I don't speak that good telugu and it is my mother tongue.
@sureshgadiparthi2687
@sureshgadiparthi2687 24 күн бұрын
మీరు మాట్లాడే తెలుగు మీ ముఖ కవలికలో స్పష్టంగా కనపడుతుంది ...మీరు తెలుగు పై చూపించన ప్రేమ వలన నేను నా భావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాను...ఒక తెలుగు ప్రొఫెసర్ గురుంచి మీరు చెప్పిన విధానం ...మేము కూడా మీ అంత బాగా భావాన్ని వ్యక్తపరిచే పరిస్థితిలో లేము ..ఒక పాత తెలుగు చిత్రం చూసిన భావం కలిగినది...ఏనా.....❤❤❤ యూ స్పోక్ వెరీ వెల్😅...సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ స్పీకింగ్ లైక్ ఎ వావ్
@impermenance
@impermenance 10 күн бұрын
Brahmaandam! Adbhutam!
@rshastry
@rshastry 14 күн бұрын
Wonderful video. Very nicely put together. Enjoyed watching it.
@arminphulkar2442
@arminphulkar2442 10 күн бұрын
wow, adbhutham!
@MultiDany23
@MultiDany23 11 күн бұрын
Amazing to hear you speak telugu with the correct diction sounds graceful ….Respect 🙌🏼
@srichinnari5031
@srichinnari5031 22 күн бұрын
Super 👌 your great 👍, All the Best
@kallipalliadinarayana5915
@kallipalliadinarayana5915 14 күн бұрын
so nice keep learning and spread in your country
@balaji-kartha
@balaji-kartha 9 күн бұрын
Once one is exposed to the languages and cultures of south India, the who perception of the world changes. Wonderful to see your experience 👍👏👏🙏🌹
@user-ur1vi6mv8w
@user-ur1vi6mv8w 22 күн бұрын
చాలా బావుంది మీ తెలుగు ఉచ్చారణ(vocabulary)
@explorelonelyplanet3696
@explorelonelyplanet3696 9 күн бұрын
Dear telugu girls, we like type of speaking just pure and simple language. No overacting no over pronounciation of half baked English language
@your9to5job82
@your9to5job82 8 күн бұрын
అన్నయ్య ముందు మనం మొదలెట్టి, తర్వాత అమ్మాయల మీద పడి ఏడుద్దాం..
@Idkmyname77
@Idkmyname77 24 күн бұрын
I fall in love with your Telugu 😅😅
@yenaa_yenaa
@yenaa_yenaa 24 күн бұрын
@@Idkmyname77 🥹
@maahi9860
@maahi9860 11 күн бұрын
yena chaala baaga matladaru meeru alaage mee vishleshana chaala bagundi
@mk44214
@mk44214 14 күн бұрын
This was so beautifully done .. Thank you for this .. Made me happy smile
@vendra007
@vendra007 11 күн бұрын
ఎంత ప్రేమగా, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారో ఈవిడ... భాష పట్ల మీకున్న అభిమానానికి, నేర్చుకోవాలన్న మీ తపనకి నా హృదయపూర్వక అభినందనలు. ఆ సరస్వతి సదా మీ తోడుండాలని కోరుకుంటున్నాను. సరస్వతీ కటాక్ష ప్రాప్తిరస్తు 🙏🙏
@yenaa_yenaa
@yenaa_yenaa 10 күн бұрын
@@vendra007 🙏🏻🙏🏻
@vishnureddy34
@vishnureddy34 25 күн бұрын
omg your great Telugu talker
@nagendravarma81
@nagendravarma81 7 күн бұрын
సోదరీ మిమ్మల్ని తెలుగు వేష భూషణాలలో చూడాలని వుంది, తమరు ఒక ప్రత్యేక వీడియోని దానికి అంకితం చేయండి ఒక సారి.
@WC2FAR
@WC2FAR 23 күн бұрын
ఎంతో చక్కగా మాట్లాడారు🎉
@Joy-hk3iv
@Joy-hk3iv 10 күн бұрын
Chala baga matladaru andi for a foreigner
@harikumarlanda6482
@harikumarlanda6482 12 күн бұрын
It's true Telugu 😊😊😊😊 iam still shock 😲😲 తెలుగు భాషలందు తెలుగు లెస్స.
@susmita262
@susmita262 22 күн бұрын
చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు❤
@ZeroDegree99
@ZeroDegree99 21 күн бұрын
Hey , yenna, great video , great journey , great job , Thank you for making amzing videos, neee telugu chala bugundi, nee smile la ento beautiful ga undi ..Thank you ...keep rocking with your beautiful videos .
@jithendratvl8922
@jithendratvl8922 20 күн бұрын
Super madam, good video, keep posting
@sreedhart4255
@sreedhart4255 18 күн бұрын
Really great you are. Hats off to your impeccable and proficient telugu speaking. You picked up appropriate words. God Bless you.
@ivk198
@ivk198 14 күн бұрын
U are great … awesome.
@Chilipipanulu
@Chilipipanulu 23 күн бұрын
Superb akka nuvvu ❤
How to find happiness in India (American’s perspective)
19:28
Max Chernov
Рет қаралды 147 М.
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 17 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
An Honest View on India After 18 Years (American’s perspective)
22:50
Why does Telugu sound so Musical?
23:08
India in Pixels by Ashris
Рет қаралды 589 М.
American explains life in India after 15 years
29:50
Max Chernov
Рет қаралды 548 М.
Most Beautiful Village in Northeast India | Mechuka | Arunachal Pradesh
24:11
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 17 МЛН