Рет қаралды 1,215,196
కంచాన తావే లేకుండా పోయింది నరణారణ సత్తువనింపే నిఖార్సయిన బువ్వకు.పాత బంధం నెమరవేసుకునేందుకైన చేరువకాలేకపోతుంది సగటు మనిషి కి. త్రోవ ఎక్కడ తప్పేమోగాని బొజ్జకు పస గల బువ్వ బుక్కెడైనా ఇవ్వకపోతుంటిమి ఈ రోజుల్లో.అసలు శ్రేష్ఠమైన పున్నీళ్లేవి,ఆకలి తీర్చి ఆదరించిన అంబలేది.వులవల ఊసేది, అనుముల అనవాళ్ళేవి.నవ ధాన్యపు పౌష్టికాహారం మన పూర్వికులు తిన్నారు కనుకే రుగ్మతలెన్నో పుట్టుకొస్తున్న ఆయువు నిలుపుకోగలుగుతున్నాం మనమిప్పుడు.కమ్మని వంటలెన్నో కనుమరుగు కాగా ఒక్క రాగి ముద్ద లేక సంగటి మన చే వెంటే వస్తుంది.నిత్యం కాకున్నా అడపదడప ఆస్వాదిస్తుండటంతో అలనాటి వంటక విశిష్టతను విశదపరుస్తుంది.సంగటి బువ్వ... ఎంత చులువగా ఉందొ ఉచ్ఛరిస్తుంటేనే.అలనాటి వంటకాల ఔన్నత్యం చాటాలన్న తాపత్రయం అలానే రాగి బువ్వ అంటే అమితంగా ఇష్టం ఉండటం చేత ఆంధ్రప్రదేశ్ మరియు కళ్యాణ కర్నాటకలో లభించు రాగి ముద్ద మరియు సంగటి గురించి చెప్పిన సంగతులెన్నో.ఈ ప్రసారం పొదిలి ఎర్రయ్య గారి రాగి సంగటి గురించి.పూరిపాక లో నిర్వహణ చేస్తారు ఆహార శాలను. ఓ వైపు పాడి. మరోవైపు ఒంగోలు గిత్తులు పొదిలి కొండ వరకు కనిపించే పొలాలు ఏకమై నెలకొన్న వాతావరణమే కాదు వండే విధానం గ్రామీణ నేపథ్యం.మేము ఇక్కడికి చేరుకునే సమయానికి పచ్చడి నూరుతున్నారు.గ్రహించిన రోటీ చప్పుడు తయారీ పట్ల లీనం చేసింది.కచ్చ పచ్చగా రొకలి కింద నలుగుతున్న కూరగాయలు కలుస్తున్న పచ్చిమిరప కారం,కల్లుప్పు చూస్తేనే నోరురిపోయింది.తమ శాలకు వచ్చే వారికి శుచి - రుచి గల ఆహారం అందించాలన్న తపన మెండుగా ఉంది యర్రయ్య గారికి.దగ్గరుండి వంటకం చేపట్టి వడ్డిస్తారు.రాగులను ముందుగానే కొనుగోలు చేసుకుని కావాల్సిన వేళ పిండి పట్టించుకుంటారు.నాడు యంత్రాలేవి లేకపోవడంతో సులభతరమైన వంటక విధానం ఉండేది కాదు.మీకు విధితమే.నాటి వంటకాలు ఇప్పుడు మనం తయారు చేసుకోవాలన్న శ్రమ వెచ్చించాల్సిందే.శరీరానికి ఆవిధంగా వ్యాయామం జరుగుతుంది కూడా .ఉదాహరణకు రాగి సంగటి తయారీ చూడండి ఎంత శక్తి చేకూర్చి చేయాల్సి ఉంటుందో.ఈ విధంగా కదంభించకపోతే ఉండలు కట్టి తినేందుకు వీలుకాదు.పోతే యర్రయ్య గారి పర్యవేక్షణలో ఈ అక్క గారు చక్కగా కలియదిప్పారు.అలా నోటికి అందిస్తే కరిగిపోయేలా.కోడికూర పులుసు చాలా చాలా బాగుంటుంది.నీరు,నీరుగా అస్సలుండదు.కలుపుకునే క్రమంలో వేళ్ళ ద్వారా పరిశీలనకు వస్తుంది సాంద్రత.సంగటితో చప్పరింతై పులుసులోనే సరళమైన మషాల మూలంగా అమోఘమైన రుచి మేట వేసింది నోట.కోడి వేపుడు ఘాటు- మితిమీరిన మంట లేకుండా రుచికరంగా ఉంది.నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ జోడించుకుని మాంసాహారం తినే విషయంలో నేను పెట్టుకున్న పరిధి మించి ఓ ముక్క ఎక్కువ తిన్నాను.కాస్త మషాల గుజ్జతో తయారు చేశారు సంగటికి మచ్చిక అయ్యేలా.
చిరునామా:- యర్రయ్య రాగి సంగటి, ఒంగోలు రోడ్, పొదిలి.
గూగుల్ లొకేషన్:- g.co/kgs/xZUq4f
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.