Рет қаралды 119,361
పల్లవి: ఏసన్న స్వరమన్నా నీవెపుడైన విన్నవా
1. జనముల శబ్దము జలముల శబ్దము
బలమైన ఉరుములతో
కలసిన స్వరము పిలిచిన యేసు
పిలిచిన స్వరమును నీవింటివా
2. ఏదెను తోటలో ఆదాము చెడగా
ఆ దేవుడే పిలిచే
యెహోవా యెదుటను ఆదాము దాగిన
అటులనే నీవును దాగేదవా
3. ఆనాడు దేవుడు మోషేను పిలువగా
ఆలించెను స్వరము
ఈనాడు నీవు ఈ స్వరము వినగా
కానాను చేరగా తరలేదవా
4. స్వరమును వినగా పరమార్థ జ్ఞాని
స్థిరుడైన యోహాను
పరమ మర్మాలు భవిష్యత్ విషయాలు
ప్రకటించే ప్రతి రోజు స్మరియించుమా
Pas.K.Parishuddarao,
Carmel Gospel Ministries,
Cobaldpet 3rd lane,
Guntur- 522002,
Andhra Pradesh,
India.
Contact Us- (+91)9849366146
Our website - www.carmel gospel ministries.org
Our e-mail - mahonnathunividya@gmail.com