స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా (2) నా ఆధారమైయున్న యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2) నీ ధర్మాసనము - నా హృదయములో స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2) నీ శ్రేష్టమైన - పరిచర్యలకై కృపావరములతో నను - అలంకరించితివే (2) ||స్తుతి|| నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2) నీ సింహాసనము - నను చేర్చుటకై నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2) ||స్తుతి||
@user-si1bv4bm9dАй бұрын
పాసిరండి ప్రైస్ లార్డ్ అండి వందనాలు శేఖర్ అన్న అతనిని పోలీసులు పట్టుకున్నారండి క్షేమంగా ఇండియా గెలుపేలాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు 🙏🙏🙏🙏🙏😭😭😭
@kotibabu1054 Жыл бұрын
హెడ్ బ్యాక్ సైడ్ నొప్పి వస్తుంది ప్రార్థన చేయండి, 🙏🙏🙏🙏