నారాయణ బలి ! నాగబలి ! మోక్ష నారాయణ బలి ! త్ర్యంబకేశ్వర్ ! గోకర్ణం ! MOKSHA NARAYANA BALI ! NAGABALI

  Рет қаралды 118,227

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

3 жыл бұрын

#pitrudosh #pitrudosha #pitrudoshpujabooking
#tryambakeshwar #నారాయణబలి #నారాయణ నాగబలి #narayananagabali #పితృ దోషం #నాగదోషం #nagadosham #rahuketupooja #narayanabali #మోక్ష నారాయణ బలి
ఈ వీడియో చూసేటప్పుడు మీరు మీ యొక్క లేదా మీ ఇంటిలోని కుటుంబ సభ్యుల యొక్క జాతకాన్ని మీ ముందు వుంచుకుని ఇందులో నేను చెప్పిన లక్షణాలు లేదా నేను స్క్రీన్ మీద తెలిపిన గ్రహ గతులు (కుటుంబ పరిస్తితులు) ఎలా వున్నాయో సరిచూసుకుని ఒక నిర్ణయానికి రండి. ఇది చాలా ముఖ్యమైన వీడియో. 17 నిముషాల నిడివి. నేను చెప్పేది వింటూ స్క్రీన్ మీద వున్న విషయాన్ని చదవండి.
పంచమహాపాతకాలనుతొలగించే నారాయణ బలి, మోక్ష నారాయణ బలి, నాగబలి
నాలుగు వేదాలలో ఒకటైన అథర్వణవేదం వివిధ రకాల మంత్ర తంత్రాలకు నిలయం అయి ఉన్నది. ఆయుర్వేదం అని పిలువబడే హైందవ వైద్యశాస్త్రంకూడా ఈ అథర్వణవేదంలోని ఒకభాగం అయి ఉన్నది. అథర్వణవేదంలో యిమిడి ఉన్న ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా మంత్ర తంత్రాలను వైద్యంలో భాగంగా ఉపయోగించటం జరుగుచున్నది.
ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం కొన్నిసార్లు ఒక రోగానికి తగిన ఔషధాలను రోగికి ఇవ్వటమే కాకుండా ఆ రోగి గత జన్మలో చేసిన పాపాలకు తగిన పరిహారాలను కూడా చేసినప్పడే ఆ రోగికి ఇచ్చిన మందులుపనిచేసి రోగం తగ్గుతుంది. గత జన్మలో చేసిన పాప ప్రభావం అధికంగా ఉంటే ఈ జన్మలో ఇప్పడు ఉన్న రోగానికి చేసే చికిత్స ఏమాత్రం ఫలించదు. అంటే కర్మ ఫలితం వెంటాడుతున్నంతవరకూ రోగం ద్వారా కలిగే బాధ అనే శిక్షను రోగి భరించితీరాలి అన్నమాట.
ఆ కారణంగానే ఇటు ఔషధాలు, అటు దైవపూజలు ఏక కాలంలో ప్రయోగించినపుడే సంపూర్ణ రోగనివారణ జరిగి ప్రశాంతత కలుగుతుంది. గోహత్య, స్త్రీ హత్య నాగుపామును చంపటం, పిల్లిని చంపటం, పసిబిడ్డల్ని చంపటం, ఇలాంటి పాపాలు గత జన్మలో చేసిఉన్నట్లయితే ఆ పాప ఫలితాలు ఈజన్మలో రోగాల రూపంలో సంక్రమిస్తాయి. ఇలా రకరకాల పాపాలవల్ల కలిగే రోగాల నివారణకు, పితృశాపాల వల్ల కలిగే సమస్యలకు పరిహారంగా చేయబడే నారాయణబలి ప్రక్రియను గురించి తెలుసుకుందాం.
నారాయణ బలి, నాగబలి విధిని ధనిష్ణా పంచకము మరియు త్రిపాద్ నక్షత్రాలలో చెయ్యకూడదని నిర్ణయసింధు అనే జ్యోతిష మహాగ్రంధము తెలియజేయు చున్నది. -
ధనిష్ణా పంచకము అనగా
ధనిష్ణా నక్షత్రము-3, 4 పాదాలు
శతభిషం
పూర్వాభాద్ర
ఉత్తరాభాద్ర
రేవతి.
త్రిపాద్ నక్షత్రములు అనగా
కృత్తిక
పునర్వసు
ఉత్తర
విశాఖ
ఉత్తరాషాఢ
పూర్వాభాద్ర
ఈ ఆరు నక్షత్రాలను త్రిపాద్(Tripad) అంటారు.
1. పంచమి, ఏకాదశి తిధులలోకానీ, శ్రవణా నక్షత్రంలోకానీ, నారాయణ బలి, నాగబలి విధిని జరిపించినట్లయితే పితృశాపం తొలగిపోయి సంతానంలేని వారికి తప్పక సంతాన భాగ్యం కలుగుతుంది.
2. హస్త, ఆశ్లేషా, మృగశిర, ఆరుద్ర, మూల, పుష్యమి, స్వాతి మరియు మూల నక్షత్రములు నారాయణ బలి, నాగబలి ప్రక్రియకు శుభప్రదమైన నక్షత్రములుగా గుర్తించాలి.
3. ఆదివారము, సోమవారము, గురువారములు నారాయణ బలి, నాగబలికి అనుకూలమైన వారములుగా శాస్త్రములు పేర్కొంటున్నాయి.
త్రయంబకేశ్వర్ క్షేత్రంలో నారాయణ బలి, మోక్ష నారాయణ బలి, నాగబలి జరిపే విధానం :
మహారాష్ట్రలోని నాసిక్ లో గల త్రయంబకేశ్వరంలో నారాయణనాగబలి మూడురోజులపాటు జరుపబడుతున్నది. ఈ విధానంలో మొదటిరోజున ఈ పరిహారం చేయించుకునేవారు కుశావర్తంలో స్నానంచేసి బ్రాహ్మణులకు వివిధ రకాల దానాలను ఇచ్చి ఆపై త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రార్థనలుచేస్తారు.
ఆ తరువాత అక్కడకు దగ్గరలో ఉన్న ధర్మస్థల అనే ప్రదేశానికివెళ్ళి అక్కడ గోదావరి మరియు అహల్యనదులు సంగమించే ప్రదేశంలో నారాయణ బలి, నాగబలి ప్రక్రియలను చేయించుకుంటారు.
కేవలము పితృదోషం, పితృశాపం ఉన్నవారే కాక ఇతరుల ఉసురు పోసుకున్నవాళ్ళు కూడా (తనకన్నా బలహీనుల్ని దౌర్జన్యంతో లొంగదీసుకుని వాళ్ళ ధన, మాన ప్రాణాల్ని దోచుకుని వాళ్ళకి తీవ్రమైన మానసికవేదన కలిగించినపుడు ఆ అశక్తులైన వారి మనోవేదన ఒక శాపం రూపం ధరించి వారిపై దౌర్జన్యం చేసినవారికి తగులుతుంది) దీనినే ఉసురు పోసుకోవటం అంటారు. ఇలా ఇతరుల ఉసురుపోసుకున్నవారికి ఎంతోచెడు జరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఆ ఉసురు తరతరాలుగా తర్వాతివారినికూడా పీడించే అవకాశం ఉంటుంది. గతంలో ఎంతోమంది రాజులు, జమిందారులు బలహీనుల ఉసురుపోసుకుని సంతాన నష్టం పొందటం భయంకర రోగాలుపాలుకావటం జరిగింది. ఆ తరువాత వారు తమ పాప పరిహారార్ధం ఆలయాలు, సత్రాలు కట్టించటంతోపాటుగాపండితులచేత నారాయణ బలి, నాగబలి లాంటి తాంత్రిక పరిహారాలనుకూడా చేయించుకుని ఉసురుబాధ తప్పించుకోవటం జరిగింది.) ఈ నారాయణ బలి, నాగబలి ప్రక్రియను చేయించుకోవటం జరుగుతుంది.
మొదటిరోజున నదిఒడ్డున ఒక ప్రదేశంలో కలశస్థాపన చేస్తారు. ఆ తరువాత బ్రహ్మ విష్ణ, రుద్ర, యమ అనే దేవతల్ని ఆరాధిస్తారు. ఆ తరువాత పర్నశార్ అనే ప్రక్రియ జరుపబడుతుంది. ఈ ప్రక్రియలో చనిపోయి అశాంతితో తల్లడిల్లుతున్న పూర్వీకుల ఆత్మలను అక్కడకు రప్పించి వారి ఆత్మశాంతికి తగిన పరిహారాలను చేయటం జరుగుతుంది.
రెండవరోజున చనిపోయిన వ్యక్తిపట్ల గౌరవాన్ని సూచిస్తూ సూతకం పాటించి కుశావర్తన్లో స్నానంచేస్తారు.
మూడవరోజున త్రయంబకేశ్వర ఆలయంలో పూజలుచేసి నారాయణ నాగబలి ప్రక్రియను తమచేత చేయించిన బ్రాహ్మణ పండితులకు తమశక్తి కొద్ది దక్షిణలు సమర్పిస్తారు.
ఒకరకంగా చెప్పాలంటే నాగబలిలోను, నారాయణ బలిలోను కూడా కృత్రిమంగా బియ్యంపిండితో తయారుచేసిన ఒక మనిషి బొమ్మకుకాని, త్రాచుపాము బొమ్మకుగాని దహన సంస్కారాలు జరిపి ఆ తరువాత వాటికి శ్రార్ధకర్మలు జరపటం జరుగుతుంది.
ఈ నారాయణనాగబలి ప్రక్రియ ఒక మంచి నక్షత్రంలో కానీ, తిథిలో కానీ, వారమునకానీ ప్రారంభించబడి, రెండవరోజు మధ్యాహ్నాన్నికి పూర్తిచేయ బడుతుంది.
ఇట్లు
మీ శ్రేయోభిలాషి

Пікірлер
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 51 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 38 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 51 МЛН