Пікірлер
@krishnapanchangam3491
@krishnapanchangam3491 16 сағат бұрын
Gn Rao the great...greater than ashwattama
@user-mn7ev8dq6d
@user-mn7ev8dq6d 18 сағат бұрын
Amma! Vanukuthunna prapancham anetuvanti video Peru enduku pettaru? Anthati vistharamaina sree chakramunu choosi kondharu asharya potharu, kondharu aanandhistharu, kondharu dhweshistharu. Anthe kani prapancham tha vanakadhu. Sree chakramu emaina boothama? Vanakadaniki. Sree chakramante challani thalli.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Күн бұрын
దైవాసురసంపద్విభాగ యోగము శ్లో|| 8: అసత్య మప్రతిష్ఠం తే జగ దాహు రనీశ్వరమ్‌ | అపరస్పర సమ్భూతం కి మన్యత్కామహైతుకమ్‌ || (నాస్తికవాద అసురగుణము) భావము:- దేవుడు అనేవాడు లేడు అనియు, దేవునిచేత జగత్తు సృష్ఠింపబడినదనుట అసత్యమనియు, స్త్రీ పురుషుల పరస్పర సంబంధము వలననే జీవరాసులు పుట్టుచున్నవని, స్త్రీ పురుష సంబంధమునకు కామము తప్ప వేరే ఏముంది అనుచున్నారు. వివరము:- భూమి మీద నాలుగు విధముల మనుషులు గలరని చెప్పవచ్చును. నాస్తికులు -దేవుడు లేడనువారు. హేతువాదులు-దేవుడు ఉంటే ఎట్లున్నాడని ప్రశ్నించువారు. ఆస్తికులు-దేవుడున్నాడని చెప్పుచు, దేవున్ని వదలి దేవుడు కాని వారిని ఆరాధించువారు. ఆత్మవాదులు-వీరు కేవలము ఆత్మల గురించే మాట్లాడుదురు. నాస్తికులకు ఆస్తికులు ఎంత వ్యతిరేఖమో అట్లే హేతువాదులకు, ఆత్మవాదులకు అంతే విరుద్ధ భావములుండును. వెనుకటి ఏడవ శ్లోకములో ఆత్మవాదులకు విరుద్ధవాదులైన హేతువాదులను గురించి చెప్పుకొన్నాము. ఇక్కడ ఈ శ్లోకములో నాస్తికవాదులను గురించి చెప్పుకోవలసియున్నది. భూమిమీద హత్యచేయు హంతకుడు, మానభంగము చేయు హత్యాచారకుడు వారి మనోభావములలో ఎంత దగ్గరివారో అలాగే నాస్తికవాది, హేతువాది దగ్గరి భావములున్నవారు. ఒకడు పాము లేదు అంటే, మరొకడు ఉంటే చెప్పు లేకుండ చేస్తానంటాడు. ఇక ఆస్తికవాది, ఆత్మవాదుల విషయమును చూస్తే వీరు కూడ దగ్గర సంబంధమున్నవారే. ఆస్తికవాది ఇదిగో పాము అంటే, ఆత్మవాది అది విషముండేపామో కాదో చూడు అంటాడు. ఆస్తికుడు పాముంది అంటే, నాస్తికుడు అసలు పామేలేదు అంటాడు. విషముండే దానినే నిజమైన పామనాలి అని ఆత్మవాది అంటే, ఏ పామున్నాదనిన లేకుండ చేస్తానంటాడు హేతువాది. ఈ విధముగ విభిన్న భావములు కలవారుగ నాస్తిక, ఆస్తిక, హేతువాద, ఆత్మవాదులున్నారు. నాస్తికుడు ఆస్తికున్ని మూఢనమ్మకము కలవాడని మూఢుడని అంటాడు. ఆస్తికుడు నాస్తికున్ని మూర్ఖభావము కలవాడని మూర్ఖుడు అంటాడు. అలాగే హేతువాది ఆత్మవాదిని భావవాది అంటాడు. ఆత్మవాది హేతువాదిని మెండివాది అంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాలుగురకముల వారిని గూర్చి చెప్పాడు. గీతలో ఎక్కువ ఆత్మవాదమును గురించి చెప్పి, దానికంటే తక్కువ ఆస్తికత్వమును చెప్పాడు. చాలాకొద్దిగ హేతువాదమును, నాస్తికవాదమును గురించి చెప్పాడు. ఇక్కడ నాస్తికవాదమును గురించి చెప్పుచు, నాస్తికులు దేవుడు లేడని విశ్వమును సృష్ఠించాడనుట పూర్తి అసత్యమని అంటారన్నాడు. (తర్వాత కామెట్లో కంటిన్యూ అయింది చూడండి)
@ramachandrarao7094
@ramachandrarao7094 Күн бұрын
అద్భుతం సార్ 🙏🙏🙏
@srinivasacharytirumala7547
@srinivasacharytirumala7547 Күн бұрын
Excellent narration sir
@wonder1470
@wonder1470 Күн бұрын
Almost full
@subhadranarayana8201
@subhadranarayana8201 Күн бұрын
దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినడం ధర్మం కాదు. తినాలని ఆలోచన రాకూడదు. వాసన కూడా పీల్చేకూడదు
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 2 күн бұрын
❤❤❤❤❤❤
@keshavgowda4785
@keshavgowda4785 2 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏💐
@keshavgowda4785
@keshavgowda4785 2 күн бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి సాష్టాంగ నమస్కారము
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 күн бұрын
(రెండో కామెంట్ కంటిన్యూ చేస్తూ) 3) ప్రయోగానికి, యోగానికి ఏమి తేడాగలదని కొందరడుగవచ్చును. దానికి జవాబు, జ్ఞానేంద్రియములకు తెలియని దానిని తెలుసుకొనుటకు కర్మేంద్రియముల సహాయముతో చేయు కార్యమును ప్రయోగము అంటున్నాము. ప్రయోగములో మనిషిలోని జ్ఞానకర్మేంద్రియములు పది పనిచేయుచున్నవి. కనిపించే ఇంద్రియాలతో కనిపించని దానిని తెలుసుకొనుటకు చేయు పనినే ప్రయోగము అనుచున్నాము. ప్రయోగముతో కనిపించని అయస్కాంత శక్తిని, దాని సాంద్రతను, దాని ఆవరణ క్షేత్రమును తెలుసుకోవచ్చును. ప్రయోగాన్నిబట్టి పరికరాలు కూడ అవసరమే. ఉదాహరణకు ఐదు ఇంద్రియాలకు తెలియని సూక్ష్మక్రిములను మైక్రోస్కోప్ ద్వార చూడగల్గుచున్నాము. ఇక యోగము యొక్క విషయానికి వస్తే ఇంద్రియాలకు తెలియని దానిని తెలుసుకోవచ్చును. కాని ఇక్కడ యోగమును శరీరమునకున్న కర్మేంద్రియ జ్ఞానేంద్రియములతో పనిలేకుండ చేయవలసియుండును. ప్రయోగములో ప్రకృతికి సంబంధించియుండి, ఇంద్రియాలకు అతీతముగనున్న దేనినైన తెలుసుకోవచ్చును. పంచభూతములకు సంబంధములేకుండ ఉన్నదానిని ప్రయోగము ద్వార తెలుసుకొనుటకు వీలులేదు. పంచభూతములకు సంబంధము లేకుండ మొత్తము ప్రకృతికి అతీతమైన దానిని యోగము ద్వార మాత్రమే తెలుసుకొనుటకు వీలగును. సర్వజగత్తులో పంచభూతములకు అతీతమైనవి మూడే కలవు. 1) జీవాత్మ 2) ఆత్మ 3) పరమాత్మ. ఈ మూడు ఎటువంటి ప్రయోగాలకు అందునవికావు. ఇంతవరకు ప్రపంచములో ఎందరో శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేసి కనుగొన్నవన్ని ప్రకృతికి సంబంధించినవేనని తెలియవలెను. భౌతికశాస్త్రము తెలిసిన డాక్టర్లకు భౌతిక శరీరము యొక్క అంతర్ భాగములు, వాటి రోగములు, వాటి నివారణ విధానములు తెలుసియుందురు. గుండెను తెరిచి చూచిన డాక్టర్లుగాని, మెదడును శస్త్రచికిత్స ద్వార చూచినవారుగాని, శరీరములోని జీవున్నిగాని, శరీరమంత ఉన్న ఆత్మనుగాని చూడలేదు. ఎందుకనగా వీరు చేసినది ప్రయోగమేకాని యోగము కాదు, కనుక ప్రకృతికి అతీతమైన ఆత్మ తెలియలేదు. కోసి లోపల చూచినపుడే తెలియని ఆత్మ, పుట్టినపుడుగాని, చనిపోయినపుడుకాని పైన మాత్రమే చూచువారికి జీవాత్మ యొక్క పుట్టుకగాని, చావుగాని ఎట్లు తెలియును. చాలామంది హేతువాదులు ప్రాణమును జీవుడు అని అనుకొన్నారు. జీవుడు వేరు, ప్రాణము వేరని తెలియనిది జీవుని యొక్క ప్రవృత్తి అనగ పుట్టుకను గూర్చిగాని, నివృత్తిని గూర్చిగాని ఎలా తెలియగలరు. అందువలన ఈ శ్లోకములో చావు, పుట్టుకలు తెలియనివారని చెప్పడము జరిగినది. శౌచము అనగా శుభ్రత అని అర్థము. ఇక్కడ శుభ్రత నీకా, నీ శరీరమునకా అని యోచించవలెను. శరీరశుభ్రత అందరు కలిగివుందురు. కాని శరీరము లోపలనున్న వాడు మాత్రము శుభ్రముగ ఉండడములేదు. అందువలన చెడుగుణముల మలినము అంటుకొన్నవానిని శుచిత్వములేని వాడన్నారు. అలాగే శరీర లోపలి సత్యము తెలియని వాడు, బయట సత్యము అను పేరుతో ఎన్ని బోర్డులు పెట్టుకొనిన, వాడు సత్యము తెలియనివాడేనని చెప్పాలి. అలాగే శరీరములో నివశించువాడు ఎవడైన లోపలి తన ఆచారమేమి అని తెలియకపోతే వాడు ఆచారములేనివాడేనని చెప్పాలి. జీవుడు శరీరములోనికి వచ్చునది, పోవునది తెలియని వాడు, గుణముల మలినము కలవాడు, లోపలి సత్యమును, ఆచారమును తెలియనివాడు, బయటి ప్రపంచములో దేశమునకు రాజయినప్పటికి వాడు అసురుడేనని చెప్పాలి.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 күн бұрын
(ముందు కామెంటు కంటిన్యూ చేస్తూ) కూలి పని చేసేవానికంటే ఎక్కువ శ్రద్ధతో, క్రమశిక్షణతో, పద్ధతిగ నైపుణ్యముతో బ్రతుకు తెరువుకని దొంగపని చేస్తే, వానికంటే వీడు బాగా చేశాడని ప్రభుత్వము యొక్క చట్టము ఒప్పుకోదు కదా! అట్లే ఆత్మవాదులకంటే హేతువాదులు సమాజ శ్రేయస్సుకొరకని విజ్ఞానముతో, క్రమశిక్షణతో, పద్ధతి ప్రకారము ఆచరించిన వానికంటే వీడు బాగా చేశాడని దేవుని యొక్క ధర్మము ఒప్పుకోదు. అందరు బ్రతుకుతెరువుకే పనులు చేస్తున్నా వానిపనిని బట్టి కొందరిని మర్యాదస్థులని, కొందరిని నేరస్థులని న్యాయశాస్త్రము ఎట్లు చెప్పగలుగుచున్నదో అలాగే ఆత్మవాదులు, హేతువాదులు సమాజశ్రేయస్సుకే పని చేస్తామనుచున్నా వారి పనినిబట్టి కొందరిని సురులని, కొందరిని అసురులని గీతాశాస్త్రము చెప్పగలుగుచున్నది. తీవ్రవాదులు గవర్నమెంటును, చట్టమును ఒప్పుకోరు. తాము చేయుచున్న తీవ్రవాదము సరియైనదే అనుచుందురు. మా పనిలో ప్రాణమును సహితము లెక్కచేయకుండ క్రమశిక్షణగా మా సిద్ధాంతములకు అనుగుణముగ నడుచుకొను చున్నామనుచుండినప్పటికి గవర్నమెంటు వారి సిద్ధాంతములను వారి క్రమశిక్షణను ఒప్పుకోక తప్పుగ లెక్కించి తీవ్రవాదము చట్టవిరుద్ధమని చెప్పుచున్నది. అలాగే తీవ్రవాదులు గవర్నమెంటును ఒప్పుకోనట్లు, హేతువాదులు దేవున్ని, ధర్మమును ఒప్పుకోరు. తాము అనుసరిస్తున్న హేతువాదము సరియైనదని అనుచుందురు. వారు వారి సిద్ధాంతములకు అనుగుణముగ నడుచుకొనుచుండిన, వారి విధానములో సత్యముగ ఉండిన, చక్కని ఆచరణకల్గియుండిన దేవుడు వారి సిద్ధాంతములను, వారి సత్యమును, వారి విధానమును ధర్మవిరుద్ధమని చెప్పుచున్నాడు. ఇపుడు అసలు విషయానికొస్తాము. ఈ శ్లోకములో మనిషి యొక్క పుట్టుక, చావు రెండు తెలియవన్నాడు కదా! అది నిజామా అని ప్రశ్నవచ్చినది కదా! దానికి జవాబు చూస్తాము. ఒక సజీవ శరీరము ప్రపంచములోని ఐదు విషయ జ్ఞానములను, ఐదు ఇంద్రియముల చేత తెలుసుకోగల్గుచున్నది. పరిమితమైన జ్ఞానమును తెలుసుకొనునది పరిమిత అవయవమని గుర్తించి వాటికి కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అని పేరు పెట్టుకున్నాము. వీటి వలన దృశ్యము, శబ్దము, వాసన, రుచి, స్పర్శ తెలియుచున్నవి. ఈ ఐదు విషయములు తప్ప ఇతరము ఏమి ఎవరికి తెలియదు. ఒక సాధారణ అమాయకునికైనగాని, శాస్త్రవేత్తయిన విజ్ఞానికి గాని ఐదు జ్ఞానములే తెలియును. ఐదు ఇంద్రియములకు తెలియనిది ఏదైనవుంటే అది ఇంద్రియాతీతమైనదని, ఇంద్రియాలకు అగోచరమైనదని చెప్పవచ్చును. ఉదాహరణకు రెండు ఇనుప ముక్కలను తీసుకొని చూస్తే వాటి ఆకారము, వాటి రంగు అన్ని ఒకలాగునే ఉన్నవి. ఆ రెండిటిలో ఒకటి అయస్కాంతమున్నది. దానిని ఏమాత్రము గుర్తించలేకపోయాము. దాని అయస్కాంతశక్తి కంటికిగాని, చెవికిగాని, స్పర్శకుగాని, రుచికిగాని, వాసనకుగాని తెలియకున్నది. కనిపించని అయస్కాంతశక్తిని వేరే విధానము ద్వార తెలుసుకోవచ్చును. అపుడది అయస్కాంతమని తెలియును. ఆ విధానము లేకుండ ఇంద్రియాలకు అయస్కాంతశక్తి తెలియలేదు, కావున దానిని ఇంద్రియాతీతశక్తి అని అనవచ్చును. లేకపోతే ఇంద్రియాగోచరశక్తి అనవచ్చును. ఇలాంటివి ప్రపంచములో ఎన్నో ఇంద్రియాలకు తెలియనివి గలవు. వాటిని ప్రత్యక్షముగకాక పరోక్షముగ తెలుసుకోవచ్చును. పరోక్షముగ తెలియుటకు ఏదో ఒక విధానము అవసరము. ఆ విధానమునే ప్రయోగము అంటున్నాము. కాని అన్నియు ప్రయోగాల ద్వార తెలియవని ముఖ్యముగ గుర్తుంచుకోవలెను. అటువంటి వాటిని ఎలా తెలుసుకోవాలనిన, కేవలము యోగాల ద్వార మాత్రమే తెలియవచ్చును. ఐదు ఇంద్రియములకు తెలియని వాటిని ప్రయోగాల ద్వార కాని, యోగాల ద్వార కాని తెలియవచ్చును. (ముడో కామెంట్లో కంటిన్యూ అయింది చూడండి)
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 күн бұрын
దైవాసురసంపద్విభాగ యోగము శ్లో|| 7: ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదు రాసురాః । న శౌచం నాపి చాఽచారో న సత్యం తేషు విద్యతే‌ || (హేతువాద అసురగుణము) భావము:- అసురులైన వారు మనిషి యొక్క పుట్టుకనుగాని, మరణముగాని తెలుసుకోలేరు. వారివద్ద శుచిత్వముగాని, ఆచారముగాని, సత్యముగాని ఉండదు. వివరము:- భూమి మీద దేవతలు, రాక్షసులు అను రెండు రకముల మనుషులు గలరని ఆరవ శ్లోకములో చెప్పిన భగవంతుడు, ఈ శ్లోకమునుండి అనేక విధములుగ ఉన్న రాక్షసులను గురించి చెప్పను మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏడవ శ్లోకములో హేతువాదులను గురించి చెప్పి, ఎనిమిదవ శ్లోకములో నాస్తికవాదులను గురించి చెప్పి, తొమ్మిదవ శ్లోకమున హేతువాదులను, నాస్తికవాదులను కలిపి ఇరువర్గము వారిని గురించి చెప్పాడు. ఈ శ్లోకములో ప్రత్యేకించి హేతువాదులను గురించి చెప్పాడు, కావున హేతువాదులను భూమిమీదున్న అసురులుగానే లెక్కించుకోవలెను. అసురులైన హేతువాదులు మనుషుల యొక్క పుట్టుకనుగాని, మరణముగాని ఏమాత్రము తెలియరన్నాడు. అంతేకాక శుచిత్వమన్నది, ఆచారమన్నది, సత్యమన్నది వారియందు లేదని, అది ఏమిటో వారికి తెలియదన్నాడు. ఈ మాట వింటూనే చాలామందికి కొన్ని ప్రశ్నలు వెంటనే రాగలవు. హేతువాదులు భూమి మీద ఎందరో ఉన్నారు. ఆస్తికులకంటే హేతువాదులు చాలా తెలివైన వారుగ కనిపిస్తున్నారు. మనిషి పుట్టడము, చావడము వారికి తెలియకుండ పోవడమేమిటి ? ఎందరో ఎం.డి డాక్టర్లు, ఎమ్.బి.బి.యస్ డాక్టర్లు హేతువాదులుగ ఉన్నారు. వారికి మనుషుల పుట్టుక, చావులు తెలియవా? ఈ మాట నమ్మదగినదేనా? ఎంతో శుభ్రముగ ఉన్న వారికి శుభ్రతలేదనడము అసత్యము కాదా? ఎందరో హేతువాదమును ముఖ్యవాదముగ పెట్టుకొన్నవారు సత్య నిర్ధారణయని, సత్యాన్వేషణయని, సత్యప్రచారమని, సత్యశోధనయని, సత్యమను పేరుతో సమాజమునకు సత్యమును తెలుపుచున్నామనుచుండగ వారివద్ద సత్యములేదని, వారికి సత్యము తెలియదనడము సమంజసమైన మాటనా? హేతువాదమునకు ఒక పద్ధతిని ఏర్పరుచుకొని దాని ప్రకారమే చివరి వరకు క్రమము తప్పకుండ ఆచరించు వారివద్ద ఆచారము లేదను గీతమాట సత్యమెట్లగును? ఇన్ని ప్రశ్నలు ఉద్భవించి, ఈ శ్లోకములో నిజములేనట్లు అనిపించుచున్నది. అయినప్పటికి లోతుగ చూస్తే అన్ని ప్రశ్నలకు జవాబు దొరికి శ్లోకములోని అసలైన సత్యము తెలియుచున్నది. మానవ సమాజములో ఎందరో ఎన్నో పనులుచేసి బ్రతుకుచున్నారు. ప్రతి పనిలోను దానికి సంబంధించిన విజ్ఞత, చేయవలసిన పద్ధతి, పనిమీద ఆసక్తి, పని విలువ అన్ని తెలిసే చేయుచుందురు. అందరు బ్రతికే ఉద్ధేశ్యముతోనే పని చేయుచున్నారు. అయినప్పటికి కొందరు చేయు పనులు చట్ట సమ్మతమైనవిగ, కొందరు చేయు పనులు చట్ట విరుద్ధముగ ఉండును. దొంగపనిచేయువానికి ఆ పనిలో నైపుణ్యత, చేయవలసిన పద్ధతి, చేయడములో ఆసక్తి అన్నియుండును. అట్లే కూలి పని చేయడానికి కూడ క్రమశిక్షణ, నైపుణ్యత, ఒక పద్ధతి, పనిలో ఆసక్తి అన్ని ఉండును. ఇద్దరి ఉద్ధేశ్యము డబ్బు కొరకే అయినప్పటికి ప్రభుత్వ దృష్ఠిలో దొంగపని చట్ట విరుద్ధముగ, కూలిపని చట్ట సమ్మతముగ ఎట్లున్నదో, అట్లే భూమిమీద అందరికి కనిపించని చట్టమొకటున్నది. ఆ చట్టములో కొందరు ధర్మవిరుద్ధులుగ, కొందరు ధర్మసమ్మతులుగ ఉన్నారు. బయటి ప్రభుత్వ చట్టములో శిక్షలున్నట్లు, లోపలి ప్రభుత్వము యొక్క ధర్మమను చట్టములో కూడ శిక్షలు గలవు. (తర్వాత కామెట్లో కంటిన్యూ అయింది చూడండి)
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 күн бұрын
వృద్ధులకే గుణాలు ఎక్కువగా పని చేస్తాయి స్వామీ
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 күн бұрын
మీరు చెప్పేది నిజమైతే జాతకంలో గత జన్మ భుక్తి అంటారు గానీ గర్భస్థ భుక్తి అనడం లేదు కదా? గర్భస్థ శిశుకి ప్రాణం ఉండదు కనుక ప్రాణం వచ్చిన క్షణం జన్మ సమయంగా తీసుకోవాలి స్వామి
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 күн бұрын
తల్లి కడుపులో ఎప్పుడు పడ్డాడో కాదు స్వామీ ప్రసవించిన తర్వాత శ్వాస మొదలైన సమయం కరెక్ట్ సమయం.వేర చోట మరణించిన శరీరంలో ఉన్న దేవుడు ఆత్మ, జీవాత్మలు కొత్తగా ప్రసవించబడిన శిశు శరీరంలో చేరితేనే గానీ కదలికలు ఉండవు.చేరిన వెంటనే శ్వాస తీసుకునే శక్తి ఆత్మ ద్వారా వస్తుంది.అదే ప్రాణం వచ్చింది అంటున్నాం.
@user-fi9cl4zc6c
@user-fi9cl4zc6c 2 күн бұрын
ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ఒక్క శ్రీచక్రం గీయ్యి తల్లి పాకిస్తాన్ వెదవలకు బుద్ది వస్తాది
@siva4571
@siva4571 2 күн бұрын
Nenu ontariga veltha meru pampite
@SankarValluri-ee6tv
@SankarValluri-ee6tv 2 күн бұрын
Video lo matladuthunna pujariki chala pogaru ekkuva ....😡😡😡😡
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 күн бұрын
( ముందు కామెంటు కంటిన్యూ చేస్తూ) దేశములో రాజు, యువరాజు, ప్రధానమంత్రి, మంత్రి అను ఎన్నియో లెక్కలేనన్ని పదవులున్నవి కదా! ఆ పదవులు మొదటినుండి ఉన్నప్పటికి ఒక పదవిలో ఒకే మనిషి ఎప్పటికి లేడు. దేశానికి రాజు పదవి శాశ్వతమైనది. అయినప్పటికి రాజు మాత్రము శాశ్వతము కాదు. ఒకే రాజ్యానికి రాజుగ ఎంతో మంది మారివుండుట మనకు తెలిసిన విషయమే. అంత దూరమెందుకు ఇప్పుడున్న ప్రధాని పదివిలో ఎంతో మంది ప్రధానులుగ ఉండి మారిపోవుట చూచుచూనే ఉన్నాము కదా! ఎంతమంది ప్రధానులు మారినా ప్రధానమంత్రి పదవి మాత్రము అలాగే శాశ్వతముగ ఉన్నది కదా! అలాగే భూమిమీద విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అను మొదలగు దేవతా పదవులు కలవు. ఈ పదవులకు అర్హత పొందిన జీవులు నిర్ణయించబడుచున్నారు. అలాగే ఒకే జీవుడు శాశ్వతముగ ఒక పదవికి అర్హుడుగ లేడు. అతను కొంత కాలముండగ, మరియొకడు కొంత కాలము అర్హత పొందుచున్నాడు. ఒక జీవుడు ప్రపంచమంతటిలోను జ్ఞానశక్తి (యోగాగ్ని)లో మొదటివాడైనాడనుకొనుము. యోగశక్తిలో మొదటివాడైన దానివలన అన్నిటికంటే పెద్ద దేవతా పదవియైన విష్ణు పదవికి అర్హత పొంది ఉండును. అప్పుడు ఆ జీవుడు స్త్రీ పురుషులలో ఏ శరీరము ధరించి ఉన్నప్పటికి అతడే విష్ణువు. అటువంటి వాడు కొద్దిపాటి కర్మతో పుట్టివుండును. ఆ జన్మలో పూర్తి జ్ఞానాగ్నిని సంపాందించుకొని, ఉన్న కొద్దిపాటి కర్మను కూడ లేకుండ చేసుకొని, ఆ జన్మలోనే మోక్షము పొందును. అప్పుడు తిరిగి ఆ పదివికి భూమి మీద ఎవడో ఒకడు జ్ఞానశక్తిలో అధికుడు అర్హత పొంది విష్ణువగును. ఈ విధముగ దేవతల పదవులు ఖాళీ ఏర్పడుచూనే ఉండును. తరువాత వాటికి ఇతరులు అర్హులగుచూనే ఉందురు. భూమిమీద జీవులే వారి వారి జ్ఞానశక్తిని బట్టి దేవతల యొక్క అర్హతలు పొందివున్నారని తెలియుచున్నది. విష్ణు, ఈశ్వర, బ్రహ్మలు కూడ భూమిమీద మనుషులేనని తెలియుచున్నది. అట్లు శరీరధారులైన దేవతలు యోగమాచరించి కర్మలేకుండ చేసుకొని మోక్షము పొందుచున్నారు. పెద్ద పెద్ద దేవతలు భూమి మీద ఉన్నప్పటికి, మాయా ప్రాబల్యము వలన వారెవరైనది వారికే తెలియదు. దేవతలైన వారు గురువులుగ, జ్ఞానులుగ, యోగులుగ, భక్తిపరులుగ, సన్న్యాసులుగ ఎందరో ఉండగ, వారికి విరుద్ధముగ ఎందరో రాక్షసులు కూడ భూమిమీదే మనుష్యుల రూపములో ఉన్నారు. జ్ఞానము కల్గిన వారికి విరుద్ధముగ ఉండు వారంత రాక్షసులే, వీరియందు జ్ఞానముకాని, జ్ఞానశక్తికాని ఏమాత్రముండదు. పరమాత్మ విషయములు వీరికి వ్యతిరేఖముగా ఉండును. ముఖ్యముగ తామసభక్తి గల రాక్షసులు తామే నిజమైన భక్తులమనుకొనుట కూడ కలదు. ఇంకనూ వారెట్లున్నారనగా క్రింది శ్లోకములు చూచెదము.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 күн бұрын
దైవాసురసంపద్విభాగ యోగము శ్లో|| 6: ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్‌ దైవ ఆసుర ఏవ చ । దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ! మే శృణు || (దైవ, అసుర గుణములు) భావము:- లోకమున దైవ అసుర అను రెండు రకముల జీవులు పుట్టుచున్నారు. దైవ విషయముల వాటి గుణముల గురించి చెప్పివున్నాను. అసురులను గూర్చి చెప్పెదను వినుము. వివరము:- దేవతలు, రాక్షసులు అను రెండు రకములవారు భూమిమీద ఉన్నారంటే నమ్మలేని విషయముగ ఉంటుంది. కాని భగవంతుడు చెప్పిన మాట నిజము. దేవతలనువారు ఎక్కడో పై లోకాలలో ఉన్నారని అనుకోవడము పొరపాటు, దేవతలు రాక్షసులు నిజముగ భూమిమీదనే ఉన్నారు. కొంత జ్ఞానమున్నవారు వీరిని భూమిమీదనే గుర్తించవచ్చును. ఈ రెండు జాతులు గుణములను బట్టి ఏర్పడుచున్నవి. ఇక్కడ 'ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ అసుర ఏవచ' అనడములో లోకములకు నిలయమైన భూమి మీదనే దేవతలు, రాక్షసులు పుట్టుచున్నారని చెప్పడము బాగుగ గ్రహించవచ్చును. దేవతలు ముప్పదిమూడు కోట్లు కలరని ప్రతీతి కలదు. వారెంత మందైనప్పటికి విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మొదలుకొని చిన్న చిన్న దేవతల వరకు భూమి మీద విస్తరించి మనుషులరూపములో ఉన్నారు. ఇక్కడ కొందరికొక అనుమానము రావచ్చును. భూమిమీద దేవతలున్నట్లె కాదా! కనిపించలేదే! వారెక్కడ ఉన్నారు? వారెట్లున్నారు? అని అడుగవచ్చును. దానికి సమాధానము భగవంతుడు చెప్పినట్లు దేవతలు రాక్షసులు భూమి మీదనే కలరు. అయినప్పటికి వారిని మనము గుర్తించలేక పోవుచున్నాము. అలా ఎదుటి వారిని గుర్తించుటకు కొంతైనా జ్ఞానదృష్ఠి అవసరము. ఎదుటి వారిని గుర్తించలేక పోవడమే కాక మానవులలో దేవతలైనవారు వారిని వారు కూడ గుర్తించలేరు. ఎదుటి వారిని గుర్తించుటకు అవకాశమున్నది కాని ఎవరిని వారు గుర్తించుటకు అవకాశములేదు. ఎదుటి వారు దేవతలని గుర్తించుటకు జ్ఞానదృష్ఠి అవసరమన్నాము కదా! అలాంటి దృష్ఠిలేని వారికి అందరు మనుషులుగానే కనిపించుచుందురు. మనుషులలో గల తారతమ్యములు తెలియవు. చిన్న చిన్న దేవతలు మొదలుకొని విష్ణువు వరకు గల దేవతా వ్యత్యాసములు మానవులలోనే కలవు. జ్ఞానశక్తి ఉన్నవారంత దేవతలేనని చెప్పవచ్చును. వారి వారి జ్ఞానశక్తిని బట్టి దేవతలందు వ్యత్యాసములు కలవు. అత్యధిక జ్ఞానశక్తివున్న వాడు విష్ణువు. అతనికంటే కొంత తక్కువ కలవాడు రుద్రుడు. తరువాత బ్రహ్మ అలాగే జ్ఞానశక్తి తగ్గుకొలది వారిలో వ్యత్యాసములుండి ఆయా దేవతలుగ చెప్పబడుచున్నారు. దీనిని బట్టి జ్ఞానశక్తి ఉన్నవారంతా దేవతలని, జ్ఞానశక్తిలేని వారంతా రాక్షసులని చెప్పవచ్చును. దేవతలైన విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మొదలగువారు ఈ కలియుగములో ఉన్నారా? విశేషమైన జ్ఞానశక్తి ఉన్న విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మొదలగువారు పరమాత్మయందైక్యము చెందక కలియుగములో కూడా ఉన్నారా? వారికి ముక్తి రాలేదా? వారు కూడ అందరి మాదిరి జన్మ ఎత్తుచునే ఉన్నారా? అను ప్రశ్నలు అందరికి రావచ్చును. దానికి సమాధానమేమనగా! (తర్వాత కామెట్లో కంటిన్యూ అయింది చూడండి)
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 күн бұрын
దైవాసురసంపద్విభాగ యోగము శ్లో|| 5: దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాఽసురీ మతా । మాశుచ స్సమ్పదం దైవీ మభిజాతోఽసి పాణ్డవ ! || (దైవ, అసుర గుణము) భావము:- దైవ అంశ మోక్షమును కల్గించును. అసురాంశ బంధమే కల్గించును. నీవు దైవాంశ సంభూతుడవైనందు వలన బాధపడవలసిన పనిలేదు. వివరము:- దైవాంశ, రాక్షసాంశ అను రెండు భాగములలో దైవాంశ దైవము వైపు, రాక్షసాంశ జన్మలవైపు మార్గములై ఉన్నవి. దైవాంశ అనుదానిలో పుట్టినవారు దైవమునకు జ్ఞానమునకు విరుద్ధమైన పనులు చేయకుందురు. మంచి పనులు చేయుచు, వాటి వలన కొద్ది కొద్దిగ ఆలోచిస్తు, ఆ ఆలోచనల వలన కొద్ది కొద్దిగ జ్ఞానము మీద ధ్యాసకల్గుచు, గురు సన్నిధికి చేరుచుందురు. అక్కడ గురువు బోధించు జ్ఞానమును బట్టి కొన్ని జన్మలకైన మోక్షమును పొందగలరు. రాక్షసాంశయందు పుట్టినవారు దైవమునకు జ్ఞానులకు విరుద్ధమైన పనులు చేయుట వలన వారికి జ్ఞానమునకు మధ్య దూరమేర్పడును. జ్ఞానము మీద ధ్యాసలేని వారు గురువులను సహితము హేళనగా మాట్లాడుచుందురు. అటువంటి వారికి జ్ఞానము యొక్క గట్టు దొరకక జన్మ జన్మలకు దైవమునకు దూరమగుచు జన్మకర్మలను పొందుచునే ఉందురు. దైవికమైన విషయములందు విలువ, గౌరవమిచ్చు సజ్జనులు (దైవాంశపరులు) దైవికమైన శ్రద్ధను పొందుచు కొన్ని జన్మల తరువాత దైవమును గురించిన సమాచారము తెలియగలరు. ఇటువంటి వారిని గూర్చియే విజ్ఞాన యోగములో 19వ శ్లోకములో 'బహూనామ్ జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ' అని అన్నారు. రాక్షసాంశ గలవారు దైవిక విషయములను చులకనగా చూస్తు జ్ఞానులను శత్రువులుగ లెక్కించుచుందురు. అటువంటివారు దేవతలకు భక్తులుకావచ్చును కాని పరమాత్మ విషయముల గురించి తెలియలేరు. జన్మ జన్మకు జ్ఞానము యొక్క గట్టుకు దూరమగుచు ఎప్పటికీ జ్ఞానమును తెలియలేరు. అర్జునుడు దైవాంశమున పుట్టినవాడు కనుక ఎన్నో జన్మల శ్రద్ధ చేత గురువుగ భగవంతుడే లభించాడు. దైవాంశములో పుట్టిన వారిని దేవతలని, రాక్షసాంశలో పుట్టిన వారిని రాక్షసులని అనుచున్నాము. పురాణాలలో చెప్పినట్లు వారెక్కడో లేరు. భూమి మీద మానవాకారులలోనే ఉన్నారు. దీని విషయము క్రింది శ్లోకములో చూడండి.
@psatyanarayana8068
@psatyanarayana8068 3 күн бұрын
Omnamsiva 🙏🙏🙏
@psatyanarayana8068
@psatyanarayana8068 3 күн бұрын
🙏🙏🙏🙏🙏
@satyakumar221
@satyakumar221 3 күн бұрын
ఒక మంచి వ్యక్తిని అదే భక్తిశ్రద్ధలు ఉన్న వ్యక్తిని, అలాగే వాక్చాతుర్యం ఉన్న వ్యక్తిని పెట్టి ఇటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలలో పంపండి, తెలుగు తీసేసి ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడుతున్న వ్యక్తి ఏ విధంగా న్యాయం చేస్తాడు?? చివరిగా ప్రసాదం ఎలా చేస్తారో మనకు తెలియకపోతేనే అందులో రుచి అలాగే ఉంటుంది
@poornachandra3621
@poornachandra3621 3 күн бұрын
Please sar help me sar 😭🙏😭
@KRD-KD13456
@KRD-KD13456 3 күн бұрын
Inni cheste intiki vachchina vallu mental anukuntaru..... 😮
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi 3 күн бұрын
Neetulu chappatam suluve acharinchatam kastam
@wonder1470
@wonder1470 2 күн бұрын
Ala enduku antunaro cheppagalara?
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 3 күн бұрын
❤❤❤❤❤❤
@nnrao1836
@nnrao1836 3 күн бұрын
GRIKIPATI IS VERY EFFICIENT AND VERY CLEVER IN BOTH TELUGU STATES SPEAKERS AND NOT PAYING ANY INCOMETAXTO GOVERNMENT THOUGH EARNING LAKHS OF RUPEESEVERY MONTH SINCE THERE ARE NOBILLS FOR HIS EARNINGS
@wonder1470
@wonder1470 2 күн бұрын
Can you please give details.. i am very curious
@DekkathiJitendra
@DekkathiJitendra 3 күн бұрын
Frad mediya
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 күн бұрын
దైవాసురసంపద్విభాగ యోగము శ్లో|| 4: దమ్భో దర్పోఽభిమాన శ్చ క్రోధః పారుష్య మేవ చ । అజ్ఞానం చాభిజాతస్య పార్థ! సమ్పద మాసురీమ్ ‌॥ (అసుర గుణము) భావము:- గర్వము, అధికారత్వము చలాయించుట, అభిమానము కల్గివుండుట, క్రోధము, కఠినత్వము కల్గివుండుట, అజ్ఞానము కల్గియుండుట రాక్షసాంశయందు పుట్టినవారికుండును.
@sumithadonthineni6213
@sumithadonthineni6213 3 күн бұрын
Mee padalaku vandanalu
@buddabhasakarrao2993
@buddabhasakarrao2993 3 күн бұрын
శ్రీ గురుభ్యోనమః
@kurumurthik6077
@kurumurthik6077 4 күн бұрын
🙏🙏
@keshavgowda4785
@keshavgowda4785 4 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏🙏💐
@budharajuanasuya1145
@budharajuanasuya1145 4 күн бұрын
😅vantasaalalo soamelu andarake 🙏🙏
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 5 күн бұрын
❤❤❤❤❤❤
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 күн бұрын
దైవాసురసంపద్విభాగ యోగము శ్రీ భగవంతుడిట్లనియె : - శ్లో|| 1: అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞా నయోగవ్యవస్థితిః । దానం దమ శ్చ యజ్ఞ శ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్‌ || (దైవగుణము) శ్లో|| 2: అహింసా సత్య మక్రోధస్త్యాగ శ్శాన్తి రపైశునమ్‌ । దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీ రచాపలమ్‌ || (దైవగుణము) శ్లో|| 3: తేజః క్షమా ధృతిః శౌచ మద్రోహో నాతిమానితా । భవన్తి సమ్పదం దైవీ మభిజాతస్య భారత ! || (దైవగుణము) భావము:- భయము లేకుండుట, సత్త్వగుణములో మంచివైన ఆరు గుణములు కల్గియుండడము, జ్ఞానము యోగములందలి వ్యవహారములన్ని తెలిసియుండడము, దానమిచ్చుట, ఇంద్రియములను స్వాధీనములో ఉంచుట, ద్రవ్య జ్ఞానయజ్ఞములు తెలిసి వేదాధ్యాయణము చేసివుండుట, తపస్సుకల్గి కపటము లేకుండుట, అహింస, సత్యమునే పలుకుట, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతికల్గి చాడీలు చెప్పకుండుట, జీవరాసులమీద దయ,విషయములందు ఆసక్తి లేకుండుట, మృదువుగ ఉండుట, గంభీరభావము కల్గియుండుట మనస్సు చలింపకుండుట, తేజస్సు, క్షమించు స్వభావము, ధైర్యము, శుభ్రత, పరులకు ద్రోహము చేయకుండుట, అభిమానము లేకుండుట దైవాంశయందు పుట్టినవారికి కల్గుచున్నవి.
@parvathigvn4858
@parvathigvn4858 5 күн бұрын
😊
@RadheKrishn_1089
@RadheKrishn_1089 5 күн бұрын
ఓమ్ 🧘🏻‍♂️__ శ్రీ గురుభ్యోనమః💐__ కృష్ణం వందే జగద్గురుమ్🙏__
@gopaldasnaidu2415
@gopaldasnaidu2415 4 күн бұрын
🎉గరికపాటి అంటే గరికపాటి
@venkateswarasarmajanaswamy6016
@venkateswarasarmajanaswamy6016 5 күн бұрын
Why devastanam allowed muslim in the kitchen ?.
@cooki4903
@cooki4903 5 күн бұрын
🙏🇮🇳🙏💐💐Sir 🌹 Mam💐💐 Well said. Correct sir. You are equal to God Sir.🙏🙏
@varunr8322
@varunr8322 5 күн бұрын
Why to fear they can relax now 😍
@lakshmiranjitha8775
@lakshmiranjitha8775 5 күн бұрын
Guruvu garu namaskaram mamu ilu katali ankuntunama ma intlo vapuchatu vundhi adhi gruha nirmaniki aduvasthuni diniki parishkaram chapandi
@MeenakshiS-vm2on
@MeenakshiS-vm2on 5 күн бұрын
Beautiful
@gsvrao3216
@gsvrao3216 5 күн бұрын
Sri yantram/chakram is for all humanity,which safe guards creation,this creation itself is untrue called as apara sanskari word,one must learn para opposite to apara,foreigners knowledge is all apara,they could not know para,parashakti that which runs time of world,it is not so easy for any man unless knows about mind,pran&ahamkara,should,stop,food,water,breath,should not depend on apara
@gsvrao3216
@gsvrao3216 5 күн бұрын
శ్రీ
@PKSHARMA1280
@PKSHARMA1280 5 күн бұрын
How much price and how can get ring? Cam you send by courrier
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 күн бұрын
దైవాసురసంపద్విభాగ యోగము శ్రీ భగవంతుడిట్లనియె : - శ్లో|| 1: అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞా నయోగవ్యవస్థితిః । దానం దమ శ్చ యజ్ఞ శ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్‌ || (దైవగుణము) శ్లో|| 2: అహింసా సత్య మక్రోధస్త్యాగ శ్శాన్తి రపైశునమ్‌ । దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీ రచాపలమ్‌ || (దైవగుణము) శ్లో|| 3: తేజః క్షమా ధృతిః శౌచ మద్రోహో నాతిమానితా । భవన్తి సమ్పదం దైవీ మభిజాతస్య భారత ! || (దైవగుణము) భావము:- భయము లేకుండుట, సత్త్వగుణములో మంచివైన ఆరు గుణములు కల్గియుండడము, జ్ఞానము యోగములందలి వ్యవహారములన్ని తెలిసియుండడము, దానమిచ్చుట, ఇంద్రియములను స్వాధీనములో ఉంచుట, ద్రవ్య జ్ఞానయజ్ఞములు తెలిసి వేదాధ్యాయణము చేసివుండుట, తపస్సుకల్గి కపటము లేకుండుట, అహింస, సత్యమునే పలుకుట, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతికల్గి చాడీలు చెప్పకుండుట, జీవరాసులమీద దయ,విషయములందు ఆసక్తి లేకుండుట, మృదువుగ ఉండుట, గంభీరభావము కల్గియుండుట మనస్సు చలింపకుండుట, తేజస్సు, క్షమించు స్వభావము, ధైర్యము, శుభ్రత, పరులకు ద్రోహము చేయకుండుట, అభిమానము లేకుండుట దైవాంశయందు పుట్టినవారికి కల్గుచున్నవి.